అవును.. పెళ్లి నిజమే

హీరోయిన్‌గా అవకాశాలు తగ్గటంతో హీరోయిన్‌ ప్రియమణి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.గత కొంత కాలంగా ఈమెకు పెద్దగా ఆఫర్లు లేవు.

 Priyamani All Set To Tie The Knot-TeluguStop.com

దాంతో ఇదే సరైన సమయం అని భావించిన ప్రియమణి పెళ్లికి ఓకే చెప్పింది.దాంతో ప్రస్తుతం ఆమె కుటుంబ సభ్యులు ఈమెకు సూట్‌ అయ్యే కరెక్ట్‌ వరుడిని వెదికే పనిలో పడ్డారు.

గత కొంత కాలంగా ఈమె పెళ్లి వార్తలపై మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఆ వార్తలపై ప్రియమణి స్పందించింది.

తాజాగా ఈమె మీడియాతో మాట్లాడుతూ.అవును.

నేను పెళ్లి చేసుకోబోతున్నాను.ప్రస్తుతం తన కుటుంబ సభ్యులు తన కోసం వరుడిని వెదుకుతున్నారు.

త్వరలోనే వరుడు ఎవరు అనే విషయం స్వయంగా నేనే చెబుతాను అంటూ చెప్పుకొచ్చింది.గత కొంత కాలంగా ఈమె మలయాళ నటుడు గోవిందతో ప్రేమలో ముగిని తేలుతుందని ప్రచారం జరిగుతోంది.

అయితే తమ ఇద్దరి మధ్య అలాంటిది ఏమీ లేదు అంటూ గతంలో పలు సార్లు చెప్పింది.తాజాగా మరోసారి తాము కేవలం సహ నటీనటులము మాత్రమే అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

ప్రియమణి పెళ్లి నిర్ణయంను ఆమె సన్నిహితులు హర్షిస్తున్నారు.పెళ్లి తర్వాత ఈమె సినిమాలకు దూరంగా ఉంటుందా లేక అవకాశం వస్తే నటిస్తుందా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube