నగ్మకు కూడా మహేష్‌..!

తెలుగు హీరోయిన్‌లలో ఏ హీరోయిన్‌ను అయినా మీకు ఏ హీరోతో నటించాలని కోరికగా ఉంది అంటే ప్రతి ఒక్కరు కూడా ఠక్కున చెప్పే పేరు సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు.టాలీవుడ్‌ హీరోయిన్స్‌ మాత్రమే కాకుండా మహేష్‌బాబుకు బాలీవుడ్‌ హీరోయిన్స్‌లో కూడా అభిమానులు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు.

 Actress Nagma Wants To Act With Mahesh-TeluguStop.com

ఈయనతో నటించేందుకు బాలీవుడ్‌ నుండి కూడా వచ్చేందుకు కాసుకు కూర్చునట్లుగా హీరోయిన్‌లు చెబుతుంటారు.ప్రస్తుత హీరోయిన్‌లకే కాకుండా మాజీ హీరోయిన్స్‌కు కూడా మహేష్‌బాబు మ్యానియానే పట్టుకుంది.

నిన్నటి తరం హాట్‌ హీరోయిన్‌ నగ్మ ప్రస్తుతం హీరోయిన్‌గా ఉంటే మహేష్‌బాబుతో తప్పకుండా నటించేదాన్ని అంటూ తాజాగా ఒక టీవీ షోలో పాల్గొన్న సమయంలో చెప్పుకొచ్చింది.తనకు ఇప్పటికి కూడా మహేష్‌బాబు అంటే ఇష్టం అని, ఆయనతో కలిసి నటించాలని ఎవరికైనా ఉంటుందని నగ్మ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరంగా రాజకీయాల్లో కొనసాగుతున్న విషయం తెల్సిందే.ఇక మహేష్‌బాబు ‘శ్రీమంతుడు’ సినిమాతో బిజీగా ఉన్నాడు.

ఆ సినిమాలో శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube