ప్రేమలో మాస్‌ అమ్మాయి..!

‘క్లాస్‌ అబ్బాయి మాస్‌ అమ్మాయి’ సినిమాతో మాస్‌ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్న ముద్దుగుమ్మ హరిప్రియ.కన్నడంకు చెందిన ఈ అమ్మడు తెలుగులో పలు సినిమాల్లో నటించింది.

 Actress Haripriya In Love With Kannada Hero-TeluguStop.com

కాని తెలుగులో ఈమెకు హీరోయిన్‌గా మంచి గుర్తింపు రాలేదు.అడపా దడపా సినిమాలు చేసినా కూడా అవి పెద్దగా సక్సెస్‌ అవ్వక పోవడంతో ఈ అమె కన్నడంకు పరిమితం అయ్యింది.

ప్రస్తుతం కన్నడంలో రెండు సినిమాల్లో నటిస్తోంది.ఇక తమిళంలో ఈమె త్వరలో ఒక సినిమాలో నటించే అవకాశాలున్నాయి.

తాజాగా ఈ అమ్మడు లవ్‌లో పడ్డట్లుగా కన్నడ మీడియాలో వార్తలు ప్రముఖంగా వస్తున్నాయి.కన్నడ నటుడు రక్షిత్‌ శెట్టితో ఈ అమ్మడు గత కొంత కాలంగా చెట్టా పట్టాల్‌ వేసుకుని తిరుగుతోంది.

ప్రస్తుతం వీరిద్దరు కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు.ఆ సినిమా షూటింగ్‌ బ్రేక్‌ సమయంలో ఒకటే ఇక ఇకలు పకపకలు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు అనధికారికంగా మీడియాకు చెబుతున్నారు.

వారి ప్రవర్తన చూస్తే వారిద్దరు డీప్‌ లవ్‌లో ఉన్నట్లుగా క్లీయర్‌గా అర్థం అవుతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు.అయితే వీరిద్దరి నుండి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు.

అందరి లాగే తమది కేవలం స్నేహం మాత్రమే అంటారో లేక తాము ప్రేమలో ఉన్నాం.త్వరలో పెళ్లి చేసుకుంటాం అని ధైర్యంగా చెబుతారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube