కమల్ హాసన్ నుంచి విడిపోయిన గౌతమీ

విలక్షణ నటుడు కమల్ హాసన్ కేవలం తన సినీజీవితం వలనే కాదు, వ్యక్తిగత విషయాల వలన కూడా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు.మొదట వాణీ గణపతిని వివాహమాడి విడాకులిచ్చిన కమల్, ఆ తరువాత సారికని పెళ్ళాడి శృతిహాసన్ కి, అక్షర హాసన్ కి జన్మనిచ్చారు.

 Actress Gauthami Quits Relationship With Kamal Haasan-TeluguStop.com

ఆ తరువాత 2004 లో ఈ దంపుతులు విడాకులు తీసుకున్నారు.

మధ్యమధ్యలో ఇద్దరు ముగ్గురు నటీమణులతో కూడా రిలేషన్ షిప్ మేయింటేన్ చేసిన కమల్, గత 13 ఏళ్ళుగా అలనాటి నటి గౌతమితో సహజీవం చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే, వీరి బంధానికి ఈరోజుతో తెరపడింది.ఈరోజు మధ్యాహ్నం కమల్ హాసన్ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు గౌతమి.

13 ఏళ్ళ తమ బంధానికి ఈరోజుతో స్వస్తిచెప్పేస్తున్నట్లు, తన జీవితంలో ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని అనుకోలేదని చెప్పారు గౌతమీ.“నేను జాలిని ఆశించి కాని, ఎవరినో నిందించడానికి ఇలా ప్రకటించట్లేదు.మానవజీవితంలో మార్పులు జరుగుతాయి.నేను మొదట ఒక తల్లిని.కాబట్టి నా బిడ్డ బాధ్యతలు ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకోవాలని భావిస్తాను.ఇండస్ట్రీకి వచ్చినప్పటినుంచి నేను కమల్ హాసన్ అభిమానిని.ఆయన ఇకపై సాధించే అన్ని విజయాలపట్ల ఆనందిస్తాను.” అంటూ చెప్పుకొచ్చారు గౌతమీ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube