Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

టాప్ లెస్ ఫోటోలకి కోటి తీసుకున్న టాప్ హీరోయిన్ -Actress Charges 1cr For Topless Photoshoot

జాక్వేలిన్ ఫెర్నాండేజ్ .. ఈ పేరు వింటే చాలు ఉత్తరాది కుర్రాళ్ళ గుండెలు తుఫాను వేగంతో పరిగెడతాయి. మోస్ట్ డిజైరబుల్ వుమెన్ పోల్ లో సన్నీ లియోన్, దీపిక పడుకునే లాంటి వాళ్ళకైనా ఒక్కోసారి తక్కువ ఓట్లు పడ్డాయేమో కాని, ఈ అమ్మడుని మాత్రం ప్రతి ఏడాది టాప్ 3లో కూర్చోబెడుతూనే ఉంది యువత. నిజానికి గొప్పగా నటించే హీరోయిన్ కాదు జాక్వేలిన్, అయినా చేతి నిండా ఆఫర్లు ఉంటాయి. అందుకు కారణం ఒక్కటే, గుక్కతిప్పుకోనివ్వలేని అందం ఈవిడ సొంతం. బాలివుడ్ లో ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ అందరికిలోకి హాట్టెస్ట్ లేడి ఈవిడే. అందుకే తన అందాలని పెట్టుబడిగా పెట్టి కేవలం ఒక్కపూటలోనే కోటి రూపాయలు సంపాదించుకుంది జాక్వేలిన్.

సాధారణంగా అయితే బాలివుడ్ టాప్ హీరోయిన్లు లక్షల్లోనే చార్జ్ చేస్తారు ఒక్కో ఫోటో షూట్ కి. ఇంతవరకు ఏ హీరోయిన్ కూడా ఒక్క ఫోటోషూట్ కి కోట్లల్లో వసూలు చేయలేదు. కాని సినిమాల్లో ఎలాగైతే కిస్సింగ్ సీన్స్ ఎక్కువ ఉంటే, లేదా బికినీ సీన్ ఉంటే, కొంత డబ్బు ఎక్కువ తీసుకుంటారో, అలాగే ఫోటోషూట్ లో ఎప్పుడైతే ఎక్కువ హాట్ గా కనిపించాల్సి ఉంటుందో, అప్పుడు కొంచెం ఎక్కువే డిమాండ్ చేస్తారు. కాని కోటి మార్కుని ఎవరు చేరుకోలేదు. మొదటిసారి జాక్వేలిన్ ఒక్క ఫోటోషూట్ కి కోటి రూపాయలు అందుకుంది.

ఒక్క పూట ఫొటోలకి ఫోజుల్లిచ్చినందుకే కోటి రూపాయాలా. ఆ ఫోటోషూట్ లో అంతలా ఏం చేసింది ఈ అమ్మడు అని ఆశ్చర్యపోతున్నారా. టాప్ లెస్ గా కనిపించిందండి. అయితే ఎక్కడైతే తన అందాలని కవర్ చేసుకోవాలో, అక్కడ జుట్టుతో కప్పేసుకొని రెచ్చగొట్టే ఫోజులు ఇచ్చింది. ఈ బోల్డ్ ఫోటోషూట్ చేసినందుకే ఆవిడకి ఏకంగా కోటి రూపాయలు ఇచ్చారు కాస్మోపాలిటన్ మ్యాగజీన్ వారు. మరి కోటి రూపాయలు రికవర్ అయ్యేంతలా ఆ మ్యాగజీన్ కి బిజినెస్ జరుగుతోందా అంటే, ఆ లెక్కలు మనకు తెలియవు కాని ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్ ఫోటోషూట్ కి రాని రెస్పాన్స్ జాక్వేలిన్ టాప్ లెస్ అందాలకే వస్తున్నాయట. మిలియన్ల కొద్ది హిట్స్ పడుతున్నాయాట.

Continue Reading

Trending…

To Top