ఇక్కడ మహేష్‌.. అక్కడ విశాల్‌

కొంత కాలం క్రితం వరకు హీరోలు సినిమాలు మాత్రమే చేసేవారు, మోడల్స్‌ కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్స్‌గా వ్యవహరించే వారు.అయితే ప్రస్తుతం ట్రెండ్‌ మారింది.

 Actor Vishal As Brand Ambassador For Thums Up-TeluguStop.com

బడా కంపెనీలు తమ ఉత్పత్తులను స్టార్‌ హీరోలతో ప్రచారం చేయించేందుకు ఉత్సాహం చూపుతున్నాయి.కొంత కాలంగా అన్ని భాషల్లోని ఒక్కరిద్దరు స్టార్‌ హీరోలు మినహా అంతా కూడా ఏదో ఒక ఉత్పత్తికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూనే ఉన్నారు.

తెలుగులో ఎక్కువ బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న మహేష్‌బాబు థమ్స్‌ అప్‌కు చాలా కాలంగా ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే.

తెలుగులో మహేష్‌బాబు ప్రచారం చేస్తున్న థమ్స్‌ అప్‌కు ఇకపై తమిళంలో విశాల్‌ ప్రచారం చేయబోతున్నాడు.

ఇప్పటి వరకు ఏ కంపెనీకి కూడా బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించని విశాల్‌ మొదటి సారి థమ్స్‌ అప్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించబోతున్నట్లుగా తాజాగా ప్రకటించాడు.జాతీయ స్థాయిలో పలువురు బాలీవుడ్‌ హీరోలు బ్రాండ్‌ అంబాసిడర్‌గా థమ్స్‌ అప్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌లుగా వ్యవహరించారు.

అలాంటి బ్రాండ్‌కు తాను అంబాసిడర్‌గా చేస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ విశాల్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube