సూపర్ స్టార్ కుటుంబంలోంచి వెండితెర మీదికీ దూసుకొచ్చిన మరో నటుడు సుధీర్ బాబు.వెనకాల అంత బ్రాండ్ ఉన్నా సరే … తనని తాను సొంతంగా నిరూపించుకునేందుకు తహతహలాడుతున్నాడు సుధీర్ బాబు.
తెలుగులో భలే మంచి రోజు అనే చిత్రంతో త్వరలో మనముందుకు రానున్న ఈ కండల వీరుడు, బాలివుడ్ లో కుడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నాడు.
సుధీర్ బాలివుడ్ లో చేస్తున్న మొదటి చిత్రం “బాఘి”.
టైగర్ ష్రాఫ్,శ్రద్ధ కపూర్ హీరోహీరోయిన్లుగా చేస్తున్నారు.షబ్బీర్ ఖాన్ దర్శకుడు, సాజిద్ నడియాడ్ వాలా నిర్మాత.
ఇందులో సుధీర్ చేస్తున్నది విలన్ పాత్రే అయినా హీరోతో సామనంగా సాగే పాత్ర కావడం విశేషం.
ప్రస్తుతం, కేరళ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం చాలా రిస్కీ షాట్స్ చేసాడట సుధీర్.
దాని వల్ల శరీరానికి చాలా చోట్ల గాయాలు అయ్యాయట .అయినా సుధీర్ స్టంట్స్ చేస్తుండటం యూనిట్ ని ఆశ్చర్యానికి గురి చేస్తోందట.ఎంతైనా ఒక సూపర్ స్టార్ కి అల్లుడు, మరో సూపర్ స్టార్ కి బావ కదా .