Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

‘అ ఆ’ విశేషాలు-About A Aa Movie

నితిన్‌, సమంత జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అఆ’. ఈ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదట ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్బంగా విడుదల చేయాలని భావించారు. కాని కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం విడుదల ఆలస్యం అవుతూ వస్తోంది. మ్యూజిక్‌ను వచ్చే నెలలో విడుదల చేయాలని నిర్ణయించారు. అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా చిత్ర ఆడియో విడుదల తేదీని చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

‘అఆ’ చిత్ర ఆడియోను వచ్చే నెల 17న హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరపాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్లుగానే నిర్మాత రాధాకృష్ణ ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ ఆడియోకు పవన్‌ను ఆహ్వానించే ఆలోచనలో త్రివిక్రమ్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో నితిన్‌ హీరోగా నటించిన ఒక చిత్ర ఆడియోను పవన్‌ ఆవిష్కరించాడు. మరోసారి నితిన్‌ కోసం పవన్‌ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భారీ స్థాయిలో ఉన్న ఈ చిత్రాన్ని త్రివిక్రమ్‌ తక్కువ ఖర్చుతో పూర్తి చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Continue Reading

Trending…

To Top