కేసీఆర్ కు ఏ.బీ.ఎన్ సవాల్!!!

తెలంగాణా ఏర్పడిం తరువాత ఆ ప్రాంత ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాపై ఉక్కుపాదం మోపారు.అయితే.టీవీ.9, మరియు ఆంధ్ర జ్యోతి ఛానెళ్లపై ఆయన తనదైన శైలిలో విరుచుకుపడటమే కాకుండా ఆ రెండు ఛానెళ్లనీ తెలంగాణాలో మూసేసెలా చేశారు.ఇదిలా ఉంటే.కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేక వార్తలు రాసేందుకు తెలంగాణలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా భయపడుతుంటే.రాధాకృష్ణ మాత్రం తన దారిలోనే ధైర్యంగా సాగుతున్నారు.నిజామాబాద్ ఇసుక కుంభకోణంపై ఆంధ్రజ్యోతి రాసిన కథనం కలకలం సృష్టించింది.

 Abn Md Open Challenge To Kcr-TeluguStop.com

మంత్రులు హరీశ్ రావు, పోచారంలకు లంచాలు ముడుతున్నాయని రాశారు.దీనిపై కేబినెట్ భేటీలో మండిపడ్డ కేసీఆర్.

తప్పుడు వార్తలు రాసే పత్రికపై కేసు వేయాలని సూచించారట.దీన్ని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ స్వాగతించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 2,500 కోట్ల రూపాయల వరకు బిల్లులు చెల్లించారని.అందులో కాంట్రాక్టర్లు ‘రుసుము’కింద 200 కోట్ల రూపాయల వరకు సమర్పించుకున్నారని రాధాకృష్ణ తన పత్రికలో ఆరోపించారు.

ఈ మొత్తం ఎవరికి చేరుతున్నదో కూడా తమకు తెలుసని… ఆయన ఎవరు? ఏమిటి? అన్నది తర్వాత వెల్లడిస్తామని తెలిపారు.ఈ విషయాన్ని ఇప్పుడు బయటపెట్టిన తనపై కూడా కేసీఆర్ కేసు వేయవచ్చని.

వేసినా తాను విచారణకు సిద్ధంగా ఉన్నానని ఈ వ్యవహారాన్ని రుజువు చేస్తానని సవాల్ విసిరారు.మరి దీనిపై మన దొర గారు ఎలా స్పందిస్తారో.చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube