వామ్మో అంత డబ్బా మహేష్ బాబు !

గత సినిమా నిరాశపరచినా, సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి చిత్రానికి మాత్రం మార్కెట్లో కనివిని ఎరుగని డిమాండ్ కనబడుతోంది.పచ్చిగా చెప్పాలంటే, బాహుబలి తరువాత ఇదే సినిమా అన్నట్లుగా.ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ఏంటంటే, మహేష్ 23వ చిత్రం యొక్క తెలుగు రాష్ట్రాల హక్కులను పూర్తిగా సొంతం చేసుకునేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ, పంపిణీ సంస్థ అభిషేక్ పిక్చర్స్‌ పావులు కదుపుతోందట.

 Abhishek Pictures’s Mega Deal For Mahesh 23-TeluguStop.com

90% డీల్ ఫిక్స్ అయినట్టే అని, ఏదైనా లెక్కలు తప్పితే తప్ప, అభిషేక్ పిక్చర్స్ మహేష్ – మురుగదాస్ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేయటం ఖాయమని తెలుస్తోంది.మరి ఈ తెలుగు రాష్ట్రాల హక్కులు ఎంతకి అమ్ముడుపోతాయో తెలుసా? లెక్క 60 కోట్లతో మొదలవుతుందని, 70 కోట్లు పలికినా పెద్దగా ఆశ్చర్యపోనక్కరలేదని, వరల్డ్ వైడ్ గా, సాటిలైట్, మ్యూజిక్ హక్కులు ఏవి కలపకుండానే ఈ సినిమా కేవలం థియేట్రికల్ రైట్స్ ద్వారా 100 కోట్లకు పైగా బిజినెస్ చేస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది.

అన్ని కలుపుకోని బాహుబలి, సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం వంద కోట్లకు పై ప్రి రిలీజ్ బిజినెస్ చేస్తే, కేవలం థియేట్రికల్ బిజినెస్ ద్వారా బాహుబలి మాత్రమే ఈ ఘనత సాధించింది.

ఇప్పుడు బాహుబలి సరసన మహేష్ బాబు – మురుగదాస్ సినిమా చేరనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube