ప్రకాశ్ రాజ్ కు గట్టి సపోర్ట్ గా దొరికింది

నటుడిగా పరిపూర్ణత చూపిస్తూనే మరోపక్క దర్శక నిర్మాతగా ప్రకాశ్ రాజ్ మంచి అనుభూతిని కలిగించే సినిమాలతో వస్తున్నాడు.మంచి టేస్టున్న దర్శక నిర్మాతగా ప్రకాశ్ రాజ్ చేసే సినిమాలు ఓ వర్గం ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి.

 Abhishek Pictures Big Support To Prakash Raj Movie-TeluguStop.com

అయితే ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ చేస్తున్న సినిమా మనవూరి రామాయణం.తెలుగు తమిళ హింది భాషల్లో ఒకేసారి నిర్మిస్తున్న ఈ సినిమాను ప్రకాశ్ రాజ్ డైరెక్ట్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమా తెలుగులో అభిషేక్ పిక్చర్స్ చేతిలో పడింది.

దసరా బరిలో వస్తున్న ఈ సినిమా అభిషేక్ పిక్చర్స్ రిలీజ్ చేస్తున్నారు.

సో దసరాకి ఎన్ని సినిమాలొచ్చినా రిలీజ్ చేసేది అభిషేక్ పిక్చర్స్ కాబట్టి మంచి థియేటర్స్ వచ్చే అవకాశాలున్నాయి.అది కాక నైజాంలో దిల్ రాజుకి మంచి పోటీ ఇస్తున్న అభిషేక్ పిక్చర్స్ మనవూరి రామాయణాన్ని భారీగా రిలీజ్ చేస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సినిమాను ఫ్యాన్సీ ప్రైజ్ కు అభిషేక్ పిక్చర్స్ దక్కించుకున్నారట.సో మొత్తానికి ప్రకాశ్ రాజ్ రామయణ కథ అలా ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్నమాట.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube