గత ఏడాది జూన్ నుంచి, వివిధ ఆరోపణలపై 11 ఆప్ ఎమ్మెల్యేలు జైలు వెళ్లారు వారి వివరాలు ఇవి.అమానుతుల్లా ఖాన్ – ఓ మహిళపై చంపుతామని ఇటీవలే ఆదివారం అరెస్టయ్యాడు
నరేష్ యాదవ్ – జూన్ 24 న ఖురాన్ ని కించపరిచారంటూ పంజాబ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేసారు.
ప్రకాష్ జర్వార్ – జూన్ మొదట్లో ఒక మహిళని లైంగికంగా వేధించాడన్నది ్రప్రదాన ఆరోపణ జులైలో అరెస్టు చేశారు.
సోమనాథ్ భారతి – గృహ హింస ఫిర్యాదు అతని భార్య దాఖలు చేసిన కేసులో సెప్టెంబర్ 2015 లో అరెస్టు చేశారు.
మనోజ్ కుమార్ – జూలై 2015 లో అతని భార్య గృహ హింస ఫిర్యాదుతో పాటు భూమి అమ్మకం వ్యవహారంలో మోసం చేసాడని కేసులో అరెస్టయ్యడు.
దినేష్ మొహానియా – ఒక మహిళపై అసభ్యంగా ప్రవర్తించడం, ఒక 60 ఏళ్ల వ్యక్తి పై దాడి చేసారని జూన్ లోఅరెస్టు చేశారు
మహీందర్ యాదవ్ – నిరసన సమయంలో దాడులకు పాల్పడ్డారని, ్రపభుత్వ అధికారులను వేధించిన ఆరోపణలపై జనవరిలో అరెస్టు చేశారు
అఖిలేష్ త్రిపాఠి – 2013 కేసులో నమోదైన ఓ అల్లర్ల కేసులకు సంబంధించి నవంబర్ 2015 లో అరెస్టు.
సురీందర్ సింగ్ – ఎన్డిఎంసి కార్మికుడిపై దాడి చేసారంటూ ఆగష్టు 2015 లో అరెస్టు.
జితేందర్ సింగ్ తోమర్ – నకిలీ విద్యా డిగ్రీలు సమర్పించినట్టు ఆరోపణలతో జూన్ 2015 లో అరెస్టు.