దర్శకధీరుడు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంలో బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ రోల్ ఫిక్స్ అయ్యింది.ఈ రోల్‌ను రాజమౌళి ఫిక్స్ చేయకపోయినా అమీర్ మాత్రం ఫిక్స్ చేసేసుకున్నాడు.
రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తోన్న బాహుబలి -2 తర్వాత ఈ ప్రాజెక్టును చేపడతాడనేదానిపై సరైన క్లారిటీ లేకపోయినా రకరకాల టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి.
ఇక రాజమౌళి ఇప్పటికే చాలాసార్లు తన జీవిత డ్రీమ్ ప్రాజెక్టుగా మహాభారతాన్ని ప్రకటించారు.
ఈ రోల్లో జూనియర్ ఎన్టీఆర్ కృష్ణుడు అయితే బాగుంటుందని సైతం రాజమౌళి చెప్పాడు.అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ సినిమా ఎప్పుడు ఉంటుందా ? అని అందరూ ఎంతో ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నారు.
ఈ వార్తలు ఇలా ఉంటే రాజమౌళి బాహుబలి 2 తర్వాత అమీర్‌తో సినిమా కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టు రూమర్లు వినిపిస్తున్నాయి.తాజాగా అమీర్‌ఖాన్ తన తాజా చిత్రం దంగల్ (తెలుగులో యుద్ధం) సినిమా ఈ నెల 23న రిలీజ్ అవుతోన్న సందర్భంగా.
ఆ చిత్రం ప్రమోషన్ల కోసం హైదరాబాద్‌కు వచ్చాడు.
ఈ సందర్భంగా రాజమౌళితో సినిమాపై స్పందిస్తూ రాజమౌళితో తన సినిమా పుకార్లేనని కొట్టిపడేశాడు.అదే టైంలో రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టు అయిన మహాభారతంలో తనకు ఛాన్స్ వస్తే కృష్ణుడు పాత్రలో నటించాలనుకుంటున్నట్టు చెప్పాడు.తనకు కృష్ణుడు కంటే కర్ణుడు పాత్ర ఇంకా ఇష్టమైనా కర్ణుడు ఆరడుగుల అజానుభాహుడు అయినందున ఆ పాత్రకు తాను సరిపోనని చెప్పాడు.
ఇక తెలుగులో తనకు చిరంజీవితో కలిసి నటించాలని ఉందని చెప్పిన అమీర్.చిరుతో కుదరకపోతే పవన్‌తో అయినా నటించాలనుకుంటున్నట్టు చెప్పాడు.
ఇక తమిళ్లో రజనీకాంత్‌తో మల్టీస్టారర్ చేయాలనుకుంటున్నట్టు చెప్పాడు.మరి అమీర్ కోరినట్టు తన డ్రీమ్ప్రాజెక్టులో కృష్ణుడు రోల్ రాజమౌళి ఇస్తాడో లేదో చూడాలి.