తెరమీద ఆమీర్ ఖాన్ ని ఏమని పిలుస్తారో మనకు తెలిసిందే.మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని అంటారు ఆయన్ని.
ఎలాంటి పాత్ర అందులో జీవించడం అయనకున్న అలవాటు.ప్రతీది అంత పర్పెక్ట్ గా ఉంటుంది కాబట్టే, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని అంటారు.
కాని పర్సనల్ లైఫ్ లో ఆయన పర్ఫెక్షనిస్ట్ కాదేమో.బాలివుడ్ లో తాజాగా వినిపిస్తున్న రూమర్లను చూస్తే త్వరలోనే ఆమీర్ ఇమేజ్ కి చాలా డ్యామేజ్ జరిగేలా ఉంది.
విషయం ఏమిటంటే .మీరు దంగల్ సినిమా చూసారా ? చూసే ఉంటారుగా.ఆ సినిమాలో ఆమీర్ ఖాన్ కి ఇద్దరు కూతుర్లు ఉంటారు.అందులో గీతా ఫోగట్ పాత్ర పోషించిన ఫాతిమా సనా షేక్ గుర్తుందా ? ఇప్పుడు ఈ కొత్తమ్మాయితో ఆమీర్ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.మీరు విన్నది నిజమే .కూతురు పాత్ర పోషించిన అమ్మాయితో ఆమీర్ ఎఫైర్ నడుపుతున్నట్లు బలమైన టాక్ నడుస్తోంది.
ఆమీర్ వయసు 51.ఫాతిమా వయసు 25.ఇద్దరి మధ్య 26 ఏళ్ళ తేడా ఉంది.దంగల్ సినిమాలో ఫాతిమాకి అవకాశమిచ్చిన ఆమీర్, తన తదుపరి సినిమా “థగ్స్ ఆఫ్ హిందోస్తాన్” లో కూడా తనకే హీరోయిన్ పాత్ర ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నాడట.
ఇప్పటికే స్క్రీన్ టెస్ట్ కూడా జరిగింది.
ఆమీర్ తో సినిమా అంటే హీరోయిన్లు క్యూ కడతారు.ఎవరి సపోర్ట్ లేకుండా 800 కోట్ల మార్కేట్ కలిగిన ఏకైక ఇండియన్ హీరో ఆమీర్.అలాంటి మెగాస్టార్ కొత్త అమ్మాయే కావాలని, అగ్రకథానాయికల్ని పక్కనపెడుతూ, తన కెరీర్ ని ప్రమోట్ చేస్తున్నాడంటేనే అర్థం చేసుకోండి .ఇద్దరి బంధం ఎంత బలపడిందో.ఆమీర్ ఇప్పటికే మొదటి భార్య రీమాకి విడాకులు ఇచ్చి, కిరణ్ రావుని పెళ్ళి చేసుకోని దశాబ్దకాలంగా తనతోనే ఉంటున్నాడు.
ఇప్పుడు కిరణ్ రావు ప్లేసులోకి ఫాతిమా వచ్చే అవకాశాలు దండిగా ఉన్నాయని గుసగుసలు పెట్టుకుంటున్నారు బాలి పీపుల్.సొంత కూతురు కాకపోయినా … సినిమాలో కూతురు పాత్ర పోషించిన అమ్మాయితో రిలేషన్ షిప్ అంటే వినడానికి కొంచెం ఎబ్బెట్టుగా ఉంది కదూ.