పవన్ - మహేష్ ఫ్యాన్స్ చేయలేని పని ఈ హీరో ఫ్యాన్స్ చేసారు

ఓ వ్యక్తీ పవన్ కళ్యాణ్ బాలివుడ్ సినిమాల్లో సైడ్ రోల్స్ చేయడానికి కూడా పనికి రాడు అన్నాడు.పవన్ చూడ్డానికి జోకర్ లా ఉంటాడు, వేస్తె గీస్తే కామేడియన్ వేషాలు వేయాలి కాని అసలు సౌత్ లో హీరోగా ఎలా చూస్తున్నారు అంటూ ఎద్దేవా చేసాడు.

 Aamir Fans Did What Pawan Kalyan And Mahesh Babu Fans Couldn’t-TeluguStop.com

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విషయంలో పంపినిదారులు చేసిన గొడవలు జాతీయవ్యాప్తంగా తెలిసేలా చేసాడు.కేవలం పవన్ నే టార్గెట్ చేయలేదు.

మహేష్ బాబు ఎంత అందంగా ఉన్నా, ఓ హీరోయిన్ ని చూస్తున్నట్లు కనిపిస్తాడు, దక్షిణాదివారు అతనంటే పడిచస్తారేమో, నేను మాత్రం ఎప్పటికి ఫ్యాన్ కాలేను అంటూ అవమానించాడు.

ఇంత రచ్చ చేసినా, ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు, అటు మహేష్ బాబు అభిమానులు ఏమి చేయలేకపోయారు.

ఎదో సోషల్ మీడియాలో బండబూతులు తిట్టడం తప్ప ఇంకేమి చేయలేదు.దాంతో అతడు మోహన్ లాల్, అల్లు అర్జున్, సమంత, ధనుష్ .ఇలా చెప్పుకుంటూపొతే చాలామంది దక్షిణాది సినిమాతారల్ని అవమానించాడు.అతనెవరో మీకు ఇప్పటికే గుర్తుకు వచ్చే ఉంటుంది.

అవును, మేం మాట్లాడుతున్నాది బాలివుడ్ వివాదాస్పద క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ (కేఆర్కీ) గురించి.

ట్విట్టర్ నే వేదికగా చేసుకొని, సినిమా తారలను ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఫేమస్ అయినా కేఆర్కేకి ఊపిరి ఆగిపోయినంత పనైంది.

అతని ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేసింది ట్విట్టర్ యాజామన్యం.దీని వెనుక ఆమీర్ ఖాన్ ఫ్యాన్స్ హస్తం ఉందట.

ఆమీర్ తన సొంత నిర్మాణంలో నిర్మించి, ఒక స్పెషల్ రోల్ చేసిన సీక్రెట్ సూపర్ స్టార్ నిన్న విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది.అయితే ఈ సినిమా మీద విడుదలకి ముందే, పదే పదే నెగెటివ్ ట్వీట్స్ చేసాడు కేఆర్కే.

దాంతో ఆమీర్ అభిమానులకి మండింది.

అయితే వారు మహేష్ – పవన్ ఫ్యాన్స్ లా కేవలం ట్విట్టర్ లో బూతులు తిట్టడంతో సరిపెట్టుకోలేదు.

అంతా ఒక్కటై, కేఆర్కే మీద అదేపనిగా ట్విట్టర్ కి ఫిర్యాదులు ఇవ్వడం మొదలుపెట్టారు.దాంతో అతని ఎకౌంట్ సస్పెండ్ అయ్యింది.

ఆమీర్ ఫ్యాన్స్ పుణ్యమా అని ట్విట్టర్ కి పట్టిన పీడ వదిలింది అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు బాలివుడ్ సెలబ్రిటీలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube