మహేష్ బాబు మంచోడు

ఆగడు సినిమా డిజాస్టర్ గా నిలవడం ఏమో గాని మహేష్ ఇక ఎప్పటికి శ్రీనువైట్ల కి అవకాశం ఇవ్వడు, ఇద్దరికీ బాగా చెడింది, కావాలనే సినిమాను శ్రీనువైట్ల తప్పుదోవ పట్టించాడు అని రకరకాల వార్తలు వచ్చాయి.ఒక్క స్టేట్మెంట్ తో వాటన్నిటిని పటాపంచలు చేసేసాడు దర్శకుడు శ్రీనువైట్ల.

 Aagadu Didn’t Effect Mahesh – Vaitla Relation-TeluguStop.com

బ్రూస్ లీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన వైట్ల మహేష్ చాలా మంచి వ్యక్తీ అని, తామిద్దరి మధ్య ఉన్న బంధం జయాపజయాలకు అతీతమైనదని, ఆగడు లాంటి డిజాస్టర్ ఇచ్చిన కొన్ని రోజులకే తన పుట్టినరోజు వస్తే మహేష్ దాన్ని చాలా ఘనంగా సెలబ్రేట్ చేసాడాని, మీడియాలో వచ్చిన వార్తలన్నీ పుకార్లే అని చెప్పుకొచ్చాడు.

నిజమే కదా, ఆగడు లాంటి డిజాస్టర్ ని పట్టుకొని శ్రీనువైట్లని ఆడిపోసుకుంటారు కాని, అంతకు ముందు వచ్చిన దూకుడుని మర్చిపోతే ఎలా.వరుస ఫ్లాప్స్ లో ఉన్న మహేష్ కి దూకుడుతో కొత్త ఉత్సాహాన్నిచ్చింది శ్రీనువైట్లానే కదా !

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube