3G ఫోన్ ని 4G లోకి ఇలా మార్చుకోవచ్చు

మొన్నమొన్నటిదాకా 3G ఫోన్ కి, 4G ఫోన్ కి మధ్య పెద్దగా వ్యత్యాస్యం చూడలేదు జనాలు.కాని జియో రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

 A Trick That Can Change Your 3g Phone To 4g-TeluguStop.com

జియో కేవలం 4G నెట్వర్క్ కి సంబంధించిన సేవలు అందిస్తోంది.దీనికి కారణం జియో పూర్తిగా LTE నెట్వర్క్ పై ఆధారపడటం.

అలాగే VoLTE ఉన్న ఫోన్ కి మాత్రమే ఎలాంటి ఆప్స్ సహాయం లేకుండా జియో కాల్స్ సౌకర్యం లభిస్తోంది.కాల్స్ పక్కనపెడితే, ఇప్పుడు అందరికి అవసరమైనది 4G ఇంటర్నెట్ సర్వీసులు.

వీటిని 3G ఫోన్స్ ఉన్నవారు పొందలేకపోతున్నారు.మరి ఎలా ? మీ 3G ఫోన్ ని 4G కి మార్చుకోవచ్చా ?

అన్ని ఫోన్లకి ఇది సాధ్యపడదు కాని, మేం చెప్పే ఓ ట్రిక్ అయితే ప్రయత్నించి చూడండి.పనిచేస్తే మీ లక్.మీ 3G మొబైల్ లో *#*#4636#*#* డయల్ చేయండి.ఆ తరువాత మీ ఫోన్లో Phone Information, Battery Information, Usage Satistics, Wi-Fi information అనే ఆప్షన్లు కనిపిస్తే సగం పని అయిపోయినట్టే.ఆ తరువాత Phone Information లోకి వెళ్ళి “set preferred network type” ని సెలెక్ట్ చేయండి.

దాంట్లో కొన్ని ఆప్షన్స్ వస్తాయి.వాటిలోంచి LTE/GSM/CDMA auto (PRL) ని సెలెక్ట్ చేసుకోని అప్డేట్ చేయండి.

ఓసారి ఫోన్ రిబూట్ లేదా స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి.ఇప్పుడు ఏదైనా 4G సిమ్ వేసి ఇంటర్నెట్ కనెక్ట్ అవుతోందో లేదో పరీక్షించండి.

అన్ని అనుకున్నట్టుగానే జరిగితే, మీరు జియో 4Gని మీ 3G ఫోన్లో వాడుకోవచ్చు.

నోట్ : ఈ ట్రిక్ ఖచ్చితంగా ప్రతీ ఫోన్లో పనిచేయదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube