శృంగార కోరిక తీర్చలేదని బాయ్ ఫ్రెండ్ ఇంటికి నిప్పు అంటించింది

సోఫీ స్టోన్ హీవర్ అనే 17-18 ఏళ్ల అమ్మాయి 43 ఏళ్ల స్టీవెన్ బెడ్దోస్ తో గత కొంతకాలంగా డేటింగ్ చేస్తోంది.టీనేజ్ చివరి దశలో ఉన్న ఈ అమ్మాయికి ఇదేమి పోయేకాలం .

 A Teen Sets Her Boyfriend’s House On Fire Because Of A $ Argument-TeluguStop.com

పోయి పోయి ఒక అంకుల్ తో డేటింగ్ చేస్తోంది అని అనుకునేరు.ఈ టీనేజర్ ని గర్ల్ ఫ్రెండ్ గా ఉంచుకున్నందుకు ఆ అంకుల్ నే మెచ్చుకోవాలి.

ఎందుకంటే సోఫీ మానసిక ప్రవర్తన అలా ఉంటుంది.ఇంగ్లీష్ దేశాల్లో ఉండే ఏంతోమంది డ్రగ్ అడిక్ట్ టీనే్జర్స్ లో సోఫీ కోడా ఒకరు.

ఈవిడ ప్రవర్తనను భరించలేక సొంత తల్లిదండ్రులే పట్టించుకోవడం మానేశారు.అలాంటి సమయంలో తనని అక్కున చేర్చుకున్నాడు స్టీవెన్.

మరి బాయ్ ఫ్రెండ్ దగ్గరైనా బుద్ధిగా ఉండాలి కదా.

మొన్న రాత్రి బాగా తాగేసిందట.అక్కడివరకు ఒకే.శృంగార విషయంలో బాయ్ ఫ్రెండ్ తో గొడవ పెట్టుకుంది.నీ వేషం చూసుకో, నీ ప్రవర్తన చూసుకో, ఎందుకు ఇలా తయారవుతున్నావు అనే అర్థంలో తిట్టాడట బాయ్ ఫ్రెండ్.అంతె, పట్టరాని కోపంతో ఊగిపోయింది.బాయ్ ఫ్రెండ్ గాఢనిద్రలో ఉండగా, ఉదయం 3 గంటల ప్రాంతంలో క్యాండిల్ తీసుకొని డోర్ కర్టెన్ కి నిప్పు అంటించింది.తప్పు చేస్తున్నానని అర్థం చేసుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తోంటే తన వల్ల కావట్లేదు.

అప్పటికీ బాయ్ ఫ్రెండ్ ని నిద్రలేపకుండా వెళ్లి పక్కింటివారి సహాయం తీసుకుంది.

మంటలు అయితే ఆరిపోయాయి కాని ఆ సమయానికే అక్కడికి చేరుకున్న పోలీసులు సోఫీని అరెస్టు చేసారు.

ప్రస్తుతం కోర్టులో విచారణ కొనసాగుతోంది.సోఫీ లాయర్ మాట్లాడుతూ “ఇద్దరి మధ్య పెద్ద మానసిక ఘర్షణ జరిగింది.

ఆ సమయంలో ఆమె భావోద్వేగాలు ఆమెతో ఈ పని చేయించాయి.తను పశ్చాత్తాపపడుతోంది.

ఆమె వయసు ఇంకా పదిహేడే.ఈ వయసులో శృంగార కోరికలు కొంచెం హెచ్చుస్థాయిలో ఉండటం సహజం.

తనని తల్లిదండ్రులు ఇప్పటికే పట్టించుకోవడం లేదు.బాయ్ ఫ్రెండ్ కుడా పట్టించుకోనట్టుగా ప్రవర్తించేసరికి కొంచెం ఎక్కువగా ఎమోషనల్ అయిపోయి చేయకూడని పని చేసింది.

కాని తన తప్పుని తాను అర్థం చేసుకుంది.ఆమె వయసుని, ఆ వయసులో ఉండే మానసిక పరిణితిని దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలని కోర్టుకి విన్నవించుకున్నాను.

ఇంత జరిగినా ఆమె బాయ్ ఫ్రెండ్ బ్రేక్ అప్ చెప్పట్లేదు.కాబట్టి అంతా సర్దుకుంటుంది అని భావిస్తున్నాను” అంటూ ప్రెస్ కి ఓ స్టేట్మెంట్ విడుదల చేసాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube