మీ బ్యాటరి ఎక్కువసేపు ఆగాలంటే ఈ టెక్నిక్ పాటించండి

ఇప్పుడు మొబైల్ ఫోన్స్ లో లిథియం అయాన్ బ్యాటరీలు వాడుతున్నారు.ఒకప్పటిలా నికెల్ బ్యాటరి ఉన్న ఫోన్లు దర్శనం ఇవ్వడం లేదు.

 A Super Technique To Prolong The Battery Life Of Your Phone-TeluguStop.com

దీనివల్ల mAh పవర్ పెరగనైతే పెరిగింది కాని హీటింగ్ ప్రాబ్లం, బ్యాటరి డ్రెయిన్ ప్రాబ్లం కూడా పెరిగిపోయింది.అందుకే సామ్సాంగ్ లాంటి బడా కంపెనీ ఫోన్లు కూడా హీటింగ్ ని తట్టుకోలేక పేలిపోతున్నాయి.

ఎంత మంచి కంపెని ఫోను కొన్నా, కొన్ని మొబైల్స్ లో బ్యాటరి కొంతకాలం వాడిన తరువాత బలహీనపడుతోంది.

ఇందుకు ఓ కారణం ఉండి అంటున్నారు టెక్ నిపుణులు.

మనం ఫోన్ బ్యాటరి 10% కిందికి వెళ్ళేదాకా చార్జింగ్ పెట్టాలన్న ఆలోచనలో ఉండం, అలాగే బ్యాటరి ఛార్జ్ లో పెట్టామంటే చాలు అది 100% అయితే కాని తీయకపోవడం పక్కనపెడితే, చార్జింగ్ ఫుల్ అయిన తరువాత కూడా అలానే ఉంచేస్తున్నాం.అలాగే బ్యాటరి ఛార్జ్ అవుతుండగానే ఫోన్ వాడుతున్నాం.

ఈ కారణం తోనే బ్యాటరి వీక్ అవుతోంది అంట.

నికెల్ బ్యాటరి వేరు.బ్యాటరి మొత్తం అయిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన తరువాత చార్జింగ్ పెట్టి ఫుల్ చేసినా, ఎక్కువకాలం ఆగేవి.కాని లిథియం అయాన్ బ్యాటరి అలా కాదు.

ఈజీగా హీట్ అయిపోతాయి.అందుకే 40-80 అనే టెక్నిక్ వాడండి అని సూచిస్తున్నారు నిపుణులు అంటే మొబైల్ బ్యాటరి 40% కిందికి పడకుండా చూసుకోవడం, అలాగే 100% పైగా చార్జింగ్ పెట్టకపోవడం.40% మరీ కష్టం అనుకుంటే కనీసం 20% ఉండగానైనా చార్జింగ్ పెట్టాలి.తక్కువ బ్యాటరితో చార్జింగ్ పెట్టినప్పుడు, అలాగే ఎక్కువసేపు చార్జింగ్ పెట్టినప్పుడు ఈ బ్యాటరీలు హీట్ అవుతాయి.

ఇలా తరుచుగా చేస్తే 30% పవర్ ని కోల్పోతాయి.అప్పటినుంచే మీ మొబైల్ తక్కువ బ్యాటరి ఇవ్వడం మొదలుపెడుతుంది.

అలాగే మొబైల్ చార్జింగ్ లో ఉండగా టాస్కింగ్ చేయడం కూడా పొరపాటే.ఈ రెండు తప్పులు చేయకుండా, 40-80 టెక్నిక్ పాటిస్తూ, మీ మొబైల్ ని కాస్త శ్రద్ధగా చార్జింగ్ పెట్టుకోండి.

ఎక్కువకాలం బ్యాటరి ఆగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube