ఆ గుడి లోపలికి వెళ్ళే ధైర్యం ఎవ్వరికి లేదు ... ఎందుకో తెలుసా?

మనం చూసినంతవరకు గుడి పరిసరాలు ఎలా ఉంటాయి, గుడి లోపల ఎలా ఉంటుంది? నిత్యం భక్తులతో రద్దీగా, దర్శనం కోసం లైన్లు కట్టిన జనాలతో, పాటలతో, భజనలతో సందడిసందడిగా ఉంటుంది.కాని హిమచల్ ప్రదేశ్ లో ఉన్న ఒక హిందు దేవాలయం అలా ఉండదు.

 A Hindu Temple In India No One Dares To Visit-TeluguStop.com

ఆ గుడి లోపలికి ఎవ్వరు పోరు.మరీ ఎక్కువ భక్తి పుట్టుకొస్తే గుడి గేటు దాకా కూడా రాకుండా, బయట కొంచెం దూరం నుంచే దండం పెట్టేసి వెళ్ళిపోతారు తప్ప లోనికి ఆడుగు పెట్టె ధైర్యం చేయరు.

మరి అక్కడ అంతలా భయపెట్టిస్తున్న విషయం ఏమిటి ? అక్కడ దెయ్యాలు ఉన్నాయా ? గుడిలో దేయ్యలేందుకు ఉంటాయి లెండి.మరి ఏమిటి సంగతి ? అది ఎవరి గుడి? జనాలు ఎందుకు లోనికి వెళ్ళలేకపోతున్నారు?

A Hindu temple in India no one dares to visit -  A Hindu Temple In India No One

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, చంబ జిల్లాలోని బహ్మార్ గ్రామంలో ఉన్న ఈ గుడిలో ఉన్నది ఏ దేవుడో తెలుసా? మృత్యుదేవత యమరాజు.ఇందులో సాక్షాత్తు కాలయముడు కొలువుదీరాడని నమ్ముతారు అక్కడి జనాలు.గుడిలో కంటికి కనిపించని నాలుగు ద్వారాలు ఉంటాయట.

అందులో ఒకటి బంగారు ద్వారం, వెండి ద్వారం, కాంస్య ద్వారం మరొకటి ఇనుప ద్వారం ఉన్నాయట.మనుషులు చేసిన పాపపుణ్యాలను బట్టి, ఎవరు ఏ ద్వారం నుంచి ఏ లోకానికి చేరుకుంటారో యమరాజు నిర్ణయిస్తాడట.

ఆ గుడిలో ఓ గది చిత్రగుప్తుడి కోసం కూడా ఉంది.యమధర్మరాజు, చిత్రగుప్తులు తమ నిజ స్వరూపంలో కూడా గుడిలో తిరుగుతారని, మనుషుల పాపపుణ్యాలు ఈ ఇద్దరు ఈ గుడిలోంచి కూడా లెక్కకడతారని ప్రజలు నమ్ముతారు.

మనిషి యొక్క ఆత్మ ఈ గుడి నుంచే వేరే లోకాలకు బయలుదేరుతుందని, మృత్యు భయంతోనే ఆ గుడి లోపలి ఎవరు వెళ్ళరని స్థానికులు చెబుతున్నారు.

ఈ గుడి కట్టి 1400 సంవత్సరాలు అవుతున్నాయి అని చరిత్రకారులు చెబుతున్నారు.

మనుషుల ఆత్మలు ఇక్కడినుంచే బయలుదేరుతాయి అని ప్రజలు చెబుతున్నారు సరే గాని, ఈ గుడి కట్టకముందు యమధర్మరాజుల వారు భూమ్మీద ఉండాలనుకున్నపుడు ఎక్కడ ఉండేవారో మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube