Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

ఉగ్రవాదుల ఎకౌంట్స్ ని హ్యాక్ చేసి అందులో పోర్న్ నింపేసి ముప్పుతిప్పలు పెడుతున్నారు-A Hackers Group Is Posting Gay Porn Posts From 250 ISIS Accounts

ఇన్నాళ్ళకు ఉగ్రవాదులని వణికించే వారు దొరికారు. వాళ్ళు ఏ దేశానికి మంత్రులు కాదు. రాష్ట్రపతులు కాదు, పోనీ మిలిటరీలో ఉన్నారా అంటే అక్కడ కూడా లేరు, వాళ్ళు హ్యాకర్స్. నమ్మడానికి కష్టంగా ఉందా ? ఒక హ్యాకర్స్ గుంపు ఉగ్రవాదులని ముప్పుతిప్పలు పెడుతోంది. టార్చర్ పెడుతోంది. అసలు కంప్యూటర్స్ ముందు కూర్చోనివ్వడం లేదు. ఇంతకీ వాళ్ళు ఏం చేస్తున్నారు ? ఎలాగో హ్యాకర్స్ కాబట్టి హ్యాక్ చేస్తారు .. మరి హ్యాక్ చేసిన తరువాత ? పోర్న్ పోస్టులు పెడుతున్నారు. నిజంగా నిజం. అది కూడా స్వలింగ సంపర్కుల పోర్న్. లెస్బియన్ పోర్న్ పెడితే ఉగ్రవాదులు కూడా ఎంజాయ్ చేస్తారేమో అని ఏకంగా గే పోర్న్ పెడుతున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, సిరియా, పాకిస్తాన్ ఉగ్రవాదులకి సంబంధించిన 250 సోషల్ మీడియా ఎకౌంట్స్ ని హ్యాక్ చేసి పడేసారు.

ఆ హ్యాకర్ పేరు వచులా ఘోస్ట్ (నిజం పేరు కాదు). అసలు పేరు బయటకి చెప్పడం లేదు. 18 నెలల నుంచి ఈ హ్యాకింగ్ ప్లాన్ నడుస్తోంది. తను ఒక్కడే ఇదంతా చేయడం లేదు. తనకో టీమ్ ఉంది. ఓర్లాండోలో జరిగిన కాల్పుల్లో కావాలని స్వలింగ సంపర్కులని టార్గెట్ చేసారు కదా. అందుకే వారి ఎకౌంట్స్ లో మగ స్వలింగ సంపర్కుల పోర్న్ పోస్ట్ చేస్తున్నారు.

“నాకు హెచ్చరికలు వస్తుంటాయి. నా తల నరికేస్తాం అని అంటుంటారు. వాళ్ళ బెదిరింపులు ఇంకా రావాలని ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నా మీద దృష్టి పెట్టి బిజీగా ఉన్నారు అంటే మిగితా పనులు చేయలేరు. కొందరు అమాయకుల ప్రాణాలు సురక్షితంగా ఉంటాయి. మేం కావాలనే ఇదంతా చేస్తున్నాం. కావాలనే గే పోర్న్ పోస్టులు వారి అకౌంట్స్ నుంచి పెడుతున్నాం. వారికి కోపం, ఏడుపు .. రెండు తెప్పించాలనే. వాళ్ళు ఇంకా నరకం చూడాలి. మాకు సోషల్ మీడియాలో ఉండేవారు సహాయం చేస్తే వారితో ఇంకా ఆడుకోవచ్చు. ఇలాంటి మంచి విషయానికి మీ సపోర్ట్ కావాలి. ఇక్కడ నేను ఓ ముఖ్య విషయం చెప్పాలి. నేను ముస్లిమ్స్ ని బాధపెట్టడానికి ఈ పనులు చేయడం లేదు. మేము కేవలం జిహాద్ అంటూ తిరిగేవాళ్ళపై పగబట్టాం. మా హ్యాకర్స్ గుంపులో కూడా ముస్లీమ్స్ ఉన్నారు. వారు కూడా ఆ దుర్మార్గులని ఏడిపిస్తున్నారు. మేం అమాయకుల ప్రాణాలు తీయని ప్రతి మతాన్ని గౌరవిస్తాం.నేను ఓర్లాండో దాడులలో ప్రాణాలు కోల్పోయిన స్వలింగ సంపర్కుల కోసం ఇదంతా చేస్తున్నాను. వాళ్ళు ఆ ప్రాణాలు తీసి రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. అమాయకుల ప్రాణాలు పోతోంటే మేం చూస్తూ ఊరుకోం ‘ అంటూ ఇండిపెండెంట్ పత్రికకు తన స్టేట్మెంట్ విడుదల చేసాడు ఆ హ్యాకర్స్ గుంపు లీడర్.

పగ తీర్చుకోవడం అంటే మనిషిని చంపడం అని తెలుసు మనకు. కాని ఇలా కూడా పగ తీర్చుకోవచ్చు, మనుషులతో ఆడుకోవచ్చు అని ఇప్పుడే తెలిసింది. కొత్తగా ఉన్నా చెత్తగా అయితే లేదు వీరి ఐడియా. ఎలా చేస్తే ఏం, ఏం చేస్తే ఏం .. తీవ్రవాదులకి మాత్రం మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Telugu

 • Genral

  Broom stick shouldn’t touch feet. Why?

  By

  మన పెద్దవాళ్ళు తరచూ చెప్పుతూ ఉంటారు. చీపురు లక్ష్మి స్వరూపం కనుక కాళ్ళకు తగలకూడదని అంటారు. కానీ చాలా మంది దీనిని...

 • Genral

  Medicinal benefits of Snake Venom

  By

  పాము విషయం మనిషిని ఏం చేస్తుంది ? కుదరితే గంటలోపే చంపేస్తుంది. ఎన్ని నిమిషాల్లో, ఎన్ని గంటల్లో మనిషి చనిపోతాడు అనే...

 • Genral

  Download this new google app and win cash everyday

  By

  గూగుల్ ప్లే స్టోర్ రకరకాల యాప్స్ ఉంటాయి. కొన్నిటీతో మనకు చాలా అవసరాలు ఉంటాయి. కొన్నిటిని మనం సరదా కోసం, ఎంజాయ్...

 • Generalphotos

  skipping for weight loss

  By

  ఈ రోజుల్లో బిజీ జీవనశైలి కారణంగా వాకింగ్,రన్నింగ్ చేయటానికి జిమ్ కి వెళ్ళటానికి సమయం ఉండటం లేదు. ముఖ్యంగా ఆడవారికి వారి...

To Top