మేక సూసైడ్ చేసుకుంది

హెడ్ లైన్ చూసి నమ్మలేక కళ్ళు తుడుచుకొని మళ్ళీ చూస్తున్నారా? మీరు చదివింది నిజమే.మనిషి ఆత్మహత్య చేసుకోవడం చాలా కామన్.

 A Goat Commits Suicide In America-TeluguStop.com

కాని ఒక మేక సూసైడ్ చేసుకుంది వింతగా.బాధకరమైన విషయం ఏమింటే, మేక ఆత్మహత్య చేసుకోవడానికి కారణం మనుషులే.

అలస్కా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టి అందించిన వివరాల ప్రకారం, ఈ ఘటన అమెరికాలో జరిగింది.అక్కడే అలస్కా సీవార్డ్ అనే ప్రాంతంలో ఒరకమైన మేకలు కనబడతాయి.

వాటిని మౌంటెన్ గోట్స్ అంటారు.ఇవి చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

దాంతో అక్కడికి వచ్చే మనుషులంతా తమ సెల్ఫీల పిచ్చితో ఆ మేకలతో ఫోటోలు దిగడం మొదలుపెట్టారు.ఓకరోజు దిగితే ఒకే.ఒకరో ఇద్దరో దిగితే ఓకే.రోజూ అదేపనిగా గుంపులకొద్ది వచ్చి, సెల్ఫీల మీద సెల్ఫీలు దిగితే వాటికి విసుగు రాదా?

ఓ మేక ఆకలేసి మెత వెతుక్కుంటూ వెళ్ళింది.దాన్ని ఆపేసి, బలవంతంగా సెల్ఫీలు దిగడం, వీడియోలు తీసుకోవడం మొదలుపెట్టారు కొంతమంది.మేక తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించదట.అయినా వదల్లేదు.కాస్త తప్పించుకోని పరుగు అందుకోగానే దాన్ని తరమటం మొదలుపెట్టారు.

ఈ బాధలన్నీ భరించలేక అక్కడే ఓ సముద్రంలో దూకేసింది మేక.మనుషులను నుంచి పూర్తిగా విముక్తి పొంది ప్రాణాలు వదిలేసింది.

ఇదండి .మనుషుల రాక్షసత్వం.మూగజీవి కూడా ఆత్మహత్య చేసుకునేంతగా బాధపెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube