నాగార్జునకి చిన్నకోడలుతో కాదు, సమంతతో ఇబ్బంది

సమంత ఎంత పెద్ద హీరోయినో మనకు తెలియనిది కాదు.ఒకేసారి తెలుగు – తమిళ భాషల్లో రాణించడం అతికొద్దిమంది హీరోయిన్లకే సాధ్యపడింది.

 A Funny Problem Nagarjuna Has With Samantha-TeluguStop.com

అందులో సమంత ఒకరు.మరి ఈ లేడి ఇంట్లో అందరిలాంటి కోడలు లాగా ఉంటుందో లేదో.

అంత దూరం వెళ్ళకుండా చూస్తే, అసలు నాగార్జునని ఎలా పిలవాలి అనేది ఇప్పుడు సమంతకి సమస్యగా మారిందట.ఇన్నిరోజులు ఒక సీనియర్ కి గౌరవం ఇస్తున్నట్లే, నాగ్ ని సర్ అని సంభోదించడం సమంతకి అలవాటు.

మరి చైతన్యతో పెళ్లి జరిగాక కూడానాగార్జునని ఇంకా సార్ అన్ని పిలిస్తే బాగోదు కదా.

అందుకే, సమంత ఎలా పిలిస్తే బాగుంటుందో ఇటు నాగార్జునకి, నాగార్జునని ఇంట్లో ఏమని పిలవాలో అటు సమంతకి అర్థం కావడం లేదట.అయితే, ఈ సమస్య పెద్ద కోడలితోనే.చిన్న కోడలితే అలాంటి ఇబ్బందేమీ లేదు మన కింగ్ కి.

ఎందుకంటే అఖిల్ చేసుకోబోయే అమ్మాయి శ్రియ భూపాల్ కి నాగార్జున అంటే చిన్నప్పటి నుంచే అలవాటు అంట.ఇరు కుటుంబాలు ఫ్యామిలి ఫ్రెండ్స్ కావాడంతో, చిన్నకోడలిని చిన్ననాటి నుంచి గారాబం చేసాడు మన నాగ్.“మామయ్య” అని పిలవడమే శ్రియకి అలవాటు.మరి సమంత ఏం అలవాటు చేసుకుంటుందో.

జనవరి 29వ తేదిన నాగచైతన్య – సమంతల నిశ్చితార్థం జరుగుతుంది అంటగా.ఆరోజే తేల్చుకుంటే మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube