ఇంగ్లీషులో తప్పులు టైప్ చేస్తే కరెక్ట్ చేసే యాప్ ఇది

ట్విట్టర్ లో ట్వీట్ చేయాలి, ఎక్కడ తప్పు చేస్తామో, అసలే ఇంగ్లీషులో తప్పు చేస్తే, ఏం తప్పు చేసామో, అక్కడ సరైన పదం, పదాలంకరణ ఏది వాడాలో కూడా తెలియని పరిస్థితి.ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వాలంటే ముందు కంపెనీ వారు పంపే మేయిల్ కి రిప్లై ఇవ్వాలి, అది కూడా ఇంగ్లీషులో.

 A Computer App That Will Correct Your Written English Mistakes-TeluguStop.com

వ్యాపారం లేదా ఉద్యోగనిమొత్తం ఏదైనా అఫీషియల్ ప్రపోజల్ పంపాలన్నా, ఇంగ్లీషులో మేయిల్ చేయాలి‌.కాని వచ్చి రాని ఇంగ్లీషుతో ఇబ్బందిపడుతూనే ఉంటాం.

ఎన్నో సమస్యలపై ఇంగ్లిషులో ఆవేశంగా ఫేస్ బుక్ లో స్పందించాలంటే కూడా భయం.కామెంట్స్ లోకి ఎవరు వచ్చి, did కి బదు does వాడావు, v1 కి బదులు v3 ఉపయోగించావు, past continuous tense లో చెప్పాల్సింది past perfect continuous tense లో చెప్పావు అంటూ ఎక్కడ అందరి ముందు అవహేళన చేస్తారో అని భయం

ఒక్కోసారి ఇంగ్లీషు బాగా వచ్చినా, గ్రామర్ మీద పట్టు ఉన్నా, తప్పులు దొర్లుతూ ఉంటాయి.అవి కావాలని, లేదా తెలియక చేసినవి కావు, ఏదో పొరపాట్లో పొరపాటు జరిగిపోతుంది.తీరా మేయిల్ పంపేసాక, పోస్టు పెట్టేసాక, అర్రెర్రే .ఇక్కడ తప్పు చూసుకోలేదు అంటూ బాధపడతాం.మరి టైపింగ్ చేసేటప్పుడే మన కంటెంట్ లో తప్పులు అప్పటికప్పుడు తెలిసిపోతే, మన తప్పులు ఒక్క చిన్న క్లిక్ తో కరెక్ట్ అయిపోతుంటే? ఎంత బాగుంటుందో కదా.మీ ఇంగ్లీష్ సమస్యలు తీర్చేందుకు ఒక సూపర్ యాప్/ సాఫ్ట్‌వేర్ ఉంది‌.దాని పేరే Grammerly

వెంటనే ప్లేస్టోర్ కి వెళ్ళి యాప్ కోసం వెతికేరు.

దొరకదు‌.ఎందుకంటే ఇది ఆండ్రాయిడ్ అప్లికేషన్ కాదు‌.

ప్రస్తుతానికి మొబైల్ వెర్షన్ అందుబాటులో లేదు‌.దీన్ని కంప్యూటర్ లో వాడుకోవచ్చు.www.grammerly.com లోకి వెళ్ళి దీన్ని పూర్తి ఉచితంగా మీ కంప్యూటర్ లో ఇంస్టాల్ చేసుకోవచ్చు.ఇంస్టాలేషన్ ఎందుకు అనుకుంటే బ్రౌజర్ కి extension లాగా వాడుకోవచ్చు

మీరు ఈమేల్ టైప్ చేసినా, ఫేస్ బుక్, ట్విట్టర్ లో పోస్ట్ టైప్ చేస్తున్నా, ఈ యాప్ కింద గ్రీన్ సిగ్నల్ లో కనబడుతూ ఉంటుంది.మీరు తప్పు చేస్తే గ్రీన్ ఐకాన్ కాస్త రెడ్ గా మారుతూ ఉంటుంది.మీరు ఎన్ని తప్పులు చేస్తే, ఆ కౌంట్ రెడ్ ఐకాన్ లో కనబడుతుంది.

మీ తప్పులు వెంటవెంటనే రెడ్ కలర్ లో అండర్ లైన్ అవుతుంటాయి.మీరు క్లిక్ నొక్కుతూ ఉంటే, అక్కడ కరెక్ట్ పదం ఏదో, ఎక్కడ కామా రావాలో, అన్ని ఆ సాఫ్ట్‌వేరే కరెక్ట్ చేసి పెడుతుంది.

మొత్తం మీద ఒక్కటంటే ఒక్క తప్పు లేని ఇంగ్లీష్ కంటెంట్ ని మీకు అందిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube