ఏంటి .. అదంతా రాజమౌళి పబ్లిసిటి కోసం చేసిందా?

మరో రెండు నెలల్లో బాహుబలి 2 విడుదల కాబోతోందన్న మాటే కాని ఇప్పటివరకూ ప్రమోషన్స్ మొదలుపెట్టలేదు మేకర్స్.ఇంకా రెండు నెలల టైమ్ ఉందిగా .

 A Clever Publicity Stunt From Rajamouli?-TeluguStop.com

తొందరేముంది అని అనుకోవద్దు.బాలివుడ్ లో నెల – నెలన్నర – రెండు నెలల ముందే మొదలుపెట్టేస్తారు.

మరి బాహుబలి హిందీలో కూడా విడుదల అవుతుంది కదా.

ప్రమోషన్స్ మొదలుపెట్టలేదు అని మనం అనుకుంటున్నాం కాని, రాజమౌళి ఆల్రెడి ఆ పని మొదలుపెట్టేసారు అని చెబుతున్నారు ట్రెడ్ ఎక్సపర్ట్స్.మొన్న బాహుబలి 2 లో షారుఖ్ ఖాన్ ఉన్నట్లు ఓ రూమర్ పుట్టుకొచ్చింది గుర్తుందా? దాంతో కొన్నిరోజులుగా బాహుబలిపై మౌనంగా ఉన్న నేషనల్ మీడియా ఒక్కసారిగా మేల్కొని ఓ రోజంతా బాహుబలిలో షారుఖ్ అంటు ప్రచారం చేసింది.

ఇది రాజమౌళి, బాహుబలి పీఆర్ టీమ్ క్రియేట్ చేసిన రూమర్ అని ఫిలింనగర్ లో టాక్ నడుస్తోంది.

బాహుబలి వస్తోందని చిన్నగా ఝలక్ ఇవ్వడానికే ఈ రూమర్ వదిలి, పబ్లిసిటి స్టంట్ చేసారని అంటున్నారు.ఇక షారుఖ్ లేడు అని తెలిసేసరికి, మళ్ళీ ఆ వార్తకి డప్పుమేలం వేసింది జాతీయ మీడియా.

దీంతో ప్రమోషన్స్ మొదలయ్యాయి.ఇక టీజర్, ట్రైలర్, ఇంటర్వ్యూలు రావడం మిగిలిఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube