కన్ ఫ్యూజన్ లో నందమూరి హీరో

ఎన్నో అంచనాలతో వచ్చిన కళ్యాణ్ రాం పూరిల ఇజం అటు హిట్ ఇటు ఫ్లాప్ అన్న విధంగా కాకుండా మధ్యలో నిలిచింది.కళ్యాణ్ రాం స్టైలిష్ మేకోవర్ ఫ్యాన్స్ ను ఉత్సాహ పరుస్తున్నా సినిమా సబ్జెక్ట్ విషయంలో కాస్త పెదవి విరుస్తున్నారు.

 A Big Confusion For Nandamuri Hero-TeluguStop.com

అయితే ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డ కళ్యాణ్ రాం సినిమా రిజల్ట్ విషయంలో కాస్త డిప్రెషన్ లో ఉన్నాడట.అది కాకుండా చేయబోయే సినిమాల విషయంలో పెద్ద కన్ ఫ్యూజన్ లో పడ్డాడట.

పటాస్ తో తనకు పవర్ ఫుల్ హిట్ ఇచ్చిన అనీల్ రావిపూడి మరో కథతో కళ్యాణ్ రాం దగ్గరకు వచ్చాడట.ఇక అల్లు శిరీష్ తో శ్రీరస్తు శుభమస్తు అంటూ హిట్ అందుకున్న పరశురాం కూడా కళ్యాణ్ రాం కోసం ఓ కథ సిద్ధం చేశాడట.

వీరిద్దరే కాకుండా ప్రస్థానంతో తనలోని ప్రతిభ చాటిన దర్శకుడు దేవాకట్టా కూడా కళ్యాణ్ రాం తో సినిమాకు స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట.అయితే పటాస్ తో తన రేంజ్ మార్చిన అనీల్ కే తన మొదటి ప్రిఫరెన్స్ ఇస్తున్న కళ్యాణ్ రాం మిగతా దర్శకుల కథలు కూడా నచ్చడంతో కన్ ఫ్యూజన్ లో ఉన్నాడట.

మరి ఫైనల్ గా కళ్యాణ్ రాం ఎవరిని సెలెక్ట్ చేస్తాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube