పవన్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ సినిమా కోసం ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదలై దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు పవన్‌ సినిమా రాలేదు.

 A Bad News For Pawan Fans-TeluguStop.com

మధ్యలో ‘గోపాల గోపాల’ సినిమా వచ్చినా కూడా అది ఫ్యాన్స్‌ను పూర్తి స్థాయిలో సంతృప్తి పర్చలేదు.అందుకే ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ సినిమా కోసం కోటి కళ్లతో ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు.

కాని పవన్‌ మాత్రం ఏదో ఒక కారణం చెప్పి ఆ సినిమాను ఆలస్యం చేస్తున్నాడు.

గత కొన్ని రోజులుగా గుజరాత్‌లో నిరాటంకంగా షూటింగ్‌ జపుకున్న ‘సర్దార్‌’ చిత్రం తాజాగా హైదరాబాద్‌ షెడ్యూల్‌ ప్రారంభం అవ్వాల్సి ఉంది.

కాని కొన్ని కారణాల వల్ల ఇప్పటి వరకు హైదరాబాద్‌ షెడ్యూల్‌ ప్రారంభం కాలేదు.చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను వచ్చే నెల రెండవ వారంలో ప్రారంభించే అవకాశాలున్నాయి.

దాంతో అనుకున్నట్లుగా జనవరి చివర్లో లేదా ఫిబ్రవరిలో ఈ సినిమా వచ్చే ఛాన్స్‌ లేదు.ఈ సినిమా విడుదల ఏప్రిల్‌ లేదా మే నెకు మారే ఛాన్స్‌ ఉంది.

అందుకే మెగా ఫ్యాన్స్‌ నిరుత్సాహ పడుతున్నారు.ఇది పవన్‌ ఫ్యాన్స్‌కు పెద్ద బ్యాడ్‌ న్యూస్‌ అని చెప్పక తప్పదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube