అందాల ఆరబోతకి సిద్ధం అంటున్న తెలుగు భామ

స్వాతి, అచ్చ తెలుగు అమ్మాయి.కలర్స్ అనే టివి ప్రోగ్రాంతో తెలుగు ఇళ్ళల్లో తిష్టవేసిన ఈ ముద్దుగుమ్మ, అష్టాచెమ్మ సినిమాలో సగటు మహేష్ బాబు అభిమానిగా వెండితెరను అలరించింది.

 Swathi Is Ready For Skin Show-TeluguStop.com

చలాకీతనం, వెతుక్కోకుండానే కనిపించే చూడచక్కనితనం స్వాతి సొంతం.అరె ! ఈ అమ్మాయి మన పక్కింటి అమ్మాయిల లేదు ! అని ఆశ్చర్యపోయేంత సహజంగా ఉంటుంది స్వాతి.

కాని ఈ ఇమేజ్ స్వాతికి భారంగా మారింది.

హీరోయిన్ అన్నాకా, కాస్తంతైనా వేసివేయనట్టుగా వేయాలి బట్టలు.

అప్పుడే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండగలం.స్వాతికి ఇప్పటివరకు వచ్చిన పాత్రలేవీ తన అందాలను చూపించేందుకు సహకరించలేదు.

ఇదే విషయమై బాధపడుతోంది స్వాతి.

తనకి గ్లామరస్ గా కనిపించాలని ఉన్నా, అలాంటి పాత్రలు రావట్లేదట.” గ్లామరస్ గా కనిపించడంలో తప్పు లేదు.వల్గర్ గా కనిపించడం తప్పు.

ట్రెండ్ ని ఫాలో అవుతూ బట్టలు వేసుకోవాలని ఉంది, అంతేకాని విచ్చలవిడిగా కాదు.గ్లామరస్ గా కనిపిస్తున్నంత వరకు అందాల ఆరబోతకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.

ఎవరైనా అలాంటి పాత్రతో వస్తే బాగుంటుంది ” అంటూ తన మనసులో మాట బయటపెట్టింది ఈ తెలుగమ్మాయి.

స్వాతి నూతన చిత్రం “త్రిపుర” ఇదే నెల 6వ తేదిన విడుదల కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube