గుణశేఖర్‌ పచ్చబొట్టు... భయం

‘బాహుబలి’ సినిమా కలెక్షన్స్‌తో దుమ్ము రేపుతున్నా కూడా పచ్చబొట్టు సాంగ్‌లో శృంగారం కాస్త శృతిమించడం ప్రస్తుతం విమర్శలకు తావిస్తున్న విషయం తెల్సిందే.భారీ ఎపిక్‌ మూవీలో ఇలాంటి శృంగార సన్నివేశాలుండకుంటే బాగుండేదంటూ విమర్శకులు సైతం అంటున్నారు.

 Gunasekhar Tense Over Rudramadevi Romantic Song-TeluguStop.com

ఇక ఇదే విషయం ప్రస్తుతం గుణశేఖర్‌ను సైతం గుండెలు జారిపోయేలా చేస్తోంది.ఈయన దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘రుద్రమదేవి’ చిత్రంలో సైతం ఇలాంటి ఒక రొమాంటిక్‌ సాంగ్‌ ఉంది.

ఆ సాంగ్‌కు ఎలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని ఆందోళనలో గుణ ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

కాకతీయ వీర నారి రుద్రమదేవిగా అనుష్క నటించింది.

ఇక ఈ సినిమాలో అనుష్క మరియు రానాల మధ్య ఒక రొమాంటిక్‌ సాంగ్‌ను గుణశేఖర్‌ తనదైన స్టైల్‌లో రొమాంటిక్‌గా చిత్రీకరించాడు.సినిమా విడుదల సమయంలో ఈ పాట వివాదాస్పదం అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.

రుద్రమదేవి వంటి వీర నారి ప్రాతను రొమాంటిక్‌ సాంగ్‌లో చూపించారనే విమర్శలు వస్తాయని గుణశేఖర్‌ భావిస్తున్నాడు.సినిమాలో ఈ పాట ఉంచాలా లేదా తీసేయాలా అనే ఆలోచనలో ఈ దర్శకుడు ఉన్నాడు.

సెప్టెంబర్‌ 4న ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube