టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ను వసూళ్లు చేస్తుంది.రెండు వారాలు గడిచిన తర్వాత కూడా మంచి కలెక్షన్స్‌ను రాబడుతున్న ఈ సినిమా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.ఇండియన్ సినిమాల్లో నెం.1 స్థానంలో ఈ సినిమా నిలిచి తనకు సాటి లేదని నిరూపించుకుంది.ఇప్పటి వరకు ఇండియాలో విడుదలైన సినిమాల్లో డిస్ట్రిబ్యూటర్లకు అత్యధిక షేరు మిగిల్చిన సినిమాల్లో ‘బాహుబలి’ మొదటి స్థానంలో ఉంది.తెలుగుతో పాటు తమిళం, హిందీ, మయాళంలో విడుదలైన ‘బాహుబలి’ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు ఏకంగా 180.35 కోట్ల షేర్‌ను తెచ్చి పెట్టింది.
‘బాహుబలి’ కలెక్షన్స్ విషయంలో ఇప్పటికి దూసుకు పోతూనే ఉంది.
మొత్తం గ్రాస్ కలెక్షన్స్ విషయంలో కూడా ‘బాహుబలి’ రికార్డు నమోదు చేసే అవకాశాలున్నాయి.ఇక ‘బాహుబలి’ తర్వాత డిస్ట్రిబ్యూటర్లకు అత్యధిక షేర్లు తెచ్చి పెట్టిన సినిమాల విషయానికి వస్తే.
‘పీకే’ రెండవ స్థానంలో ఉంది.ఇది డిస్ట్రిబ్యూటర్లకు 175 కోట్లు వసూళ్లు చేసి పెట్టింది.ధూమ్-3 మూవీ 149 కోట్లతో మూడవ స్థానంలో ఉంది.రోబో 129 కోట్లతో న్గావ స్థానంలో, కిక్(హిందీ) 117.5 కోట్లతో అయిదవ స్థానంలో ఉంది.ప్రపంచ వ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్ల షేర్ చూసుకుంటే ‘బాహుబలి’ మూడవ స్థానంలో ఉంది.