20 ఏళ్ల తర్వాత అంటున్న వర్మ

రామ్‌గోపాల్‌ వర్మ ఏం చేసినా కూడా వైవిధ్యభరితంగా ఉంటుంది.సినిమా తీసినా, దాన్ని ప్రమోషన్‌ చేయడంలో అన్ని విభాగాల్లో కూడా వర్మ తన వైవిధ్యాన్ని చూపిస్తూ ఉంటాడు.

 Director Rgv In Maa Voori Vanta Programme-TeluguStop.com

తాజాగా ఈయన తెరకెక్కించిన చిత్రం ‘365 డేస్‌’.ఈ సినిమాను త్వరలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.

నందు హీరోగా నటించిన ఈ సినిమాలో అనైక హీరోయిన్‌గా నటించింది.చాలా కాలం తర్వాత క్లీ యూ సినిమాను రామ్‌గోపాల్‌ ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు.

ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా రామ్‌ గోపాల్‌ వర్మ మాటీవీలో ప్రసారం అయ్యే ‘మా ఊరి వంట’ అనే కార్యక్రమంలో పాల్గొన్నాడు.సినిమా ప్రమోషన్‌ అన్నట్లుగా ఉంటుంది, తనకు వ్యక్తిగత పబ్లిసిటీ కూడా వస్తుందని భావించాడో ఏమో కాని, మా ఊరి వంట కార్యక్రమంలో వర్మ సందడి చేశాడు.

యాంకర్‌తో, కుక్కర్‌తో వర్మ సందడి చేశాడు.త్వరలో ఈ కార్యక్రమం మాటీవీలో ప్రసారం కాబోతుంది.

ఇప్పటికే మాటీవీలో వర్మ ‘మా ఊరి వంట’ కార్యక్రమం ప్రోమో వస్తోంది.ఆ ప్రోమోలో తాను వంట గదికి రాక 20 సంవత్సరాలు అయ్యింది అంటూ చెప్పుకొచ్చాడు.

ఎంతైనా వర్మ ఏం చేసినా కూడా వెరైటీ మరియు పబ్లిసిటే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube