ఆమె కష్టాలు కంటిన్యూ..!

‘గంగ’ సినిమా కోసం రాఘవ లారెన్స్‌ రెండు సంవత్సరాలు కష్టపడ్డాడు.తనతో పాటు ఈ సినిమాలో నటించిన నటీనటులను మరియు టెక్నీషియన్స్‌ను కూడా లారెన్స్‌ తెగ కష్టపెట్టాడు.

 Promotional Song For Muni 3 Ganga-TeluguStop.com

ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యి తమిళంలో విడుదల కూడా అయ్యింది.తెలుగు మరియు తమిళంలో ఒకే సారి విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల తెలుగులో ఆగిపోయింది.

తమిళంలో ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో త్వరలో విడుదల చేయాలని ప్రయత్నాలు జరగుతున్నాయి.ఈ గ్యాప్‌లో ‘గంగ’కు మరింత ముస్తాబు చేయాలని లారెన్స్‌ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన తాప్సి రెండు సంవత్సరాలు ఈ సినిమా కోసం పని చేసింది.ఇన్నాళ్లకు ఆ సినిమా పూర్తి అయ్యిందని సంతోషిస్తున్న సమయంలో మరి కొన్ని రోజులు ఈ సినిమా కోసం పని చేయాలి అంటూ లారెన్స్‌ ఈమెకు సందేశం పంపాడట.

ఈ విషయాన్ని స్వయంగా తాప్పి చెప్పుకొచ్చింది.‘గంగ’ సినిమా కోసం లారెన్స్‌ ఒక ప్రమోషనల్‌ సాంగ్‌ను ప్లాన్‌ చేశాడు.

అందుకోసం తాప్సి మరో వారం రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది.ఈ సినిమాలో తాప్సి డ్యాన్స్‌, కమర్షియల్‌ సాంగ్‌ లేదు.

ఆ లోటును ఈ పాట తీర్చుతుందని సినీ వర్గాల వారు అంటున్నారు.తెలుగులో ఎప్పుడు ఈ సినిమా విడుదల అయ్యేది త్వరలో తేలిపోనుంది.

ఈ సినిమాను తెలుగులో బెల్లంకొడ సురేష్‌ నిర్మించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube