విశ్వాసం కలిగించడానికే....

కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పవిత్ర పుణ్యం క్షేత్రం కేదార్‌నాథ్‌కు కాలి నడకన శుక్రవారం చేరుకున్నారు.ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి హెలిక్యాప్టర్‌ ఏర్పాటు చేస్తానని చెప్పినా తిరస్కరించి గురువారం పదహారు కిలోమీటర్ల నడక ప్రారంభించారు.

 Rahul Treks To Kedarnath, Pays Homage To Flood Victims-TeluguStop.com

సామాన్యులు చాలామంది కాలినడకన కొండలు ఎక్కి దేవుడిని దర్శించుకోవడం చూస్తుంటాం.కాని రాహుల్‌ వంటి నాయకుడు కాలి నడకన దైవదర్శనానికి వెళ్లారంటే వార్తే కదా.రెండేళ్ల క్రితం ఇక్కడ భారీ వరదలు రావడంతో వందలాదిమంది చనిపోయిన విషయం గుర్తుండే ఉంటుంది.ఆ మృతులకు రాహుల్‌ నివాళులర్పించారు.

తాను నడిచి రావడానికి ఇదో కారణమని, మరో కారణం కూడా ఉందని అన్నారు.కేదార్‌నాథ్‌కు రావడానికి భక్తులు భయపడుతున్నారని, వారిలో, స్థానికుల్లో విశ్వాసం కలిగించడానికే తాను పాదయాత్ర చేశానని చెప్పారు.

రెండేళ్ల క్రితం చార్‌ధామ్‌ యాత్రలో వరదల దుర్ఘటన తరువాత మొదటిసారిగా ఈ ఆలయాన్ని శుక్రవారం తెరిచారు.తాను ఎప్పుడు ఆలయాలకు వెళ్లినా భగవంతుడిని ఏమీ కోరుకోనని చెప్పారు.

కేదార్‌నాథ్‌కు రావడంతో తనలో ఆధ్మాత్మిక శక్తి ప్రవేశించిందన్నారు.రాహుల్‌ విదేశాల నుంచి వచ్చాక చాలా మార్పులు కనబడుతున్నాయి.

అందులో ఆధ్యాత్మికత కూడా ఒకటా?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube