వారు అందులో బెస్ట్‌

తెలుగమ్మాయి శ్రీదివ్వ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయం అయ్యి, కోలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా దూసుకు పోతున్న విషయం తెల్సిందే.తెలుగులో పలు సినిమాల్లో నటించినా కూడా పెద్దగా ఈమెకు గుర్తింపు రాలేదు.

 Actress Sri Divya Comments Telugu Audience-TeluguStop.com

కాని తమిళంలో ఈమె చేసిన పలు పాత్రలకు విమర్శకుల ప్రశంసలు దక్కడంతో పాటు ఈమెకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.ఇప్పటికే ఈ అమ్మడు తమిళంలో నటించిన పలు సినిమాలు సక్సెస్‌ అయ్యాయి.

ప్రస్తుతం మరిన్ని సినిమాల్లో నటిస్తూనే ఉంది.

తాజాగా ఈమె తెలుగులో ‘వారధి’ సినిమాతో ప్రేక్షకుల ముందకు వచ్చింది.

అయితే ఆ సినిమాలో ఈమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది.కాని ఈమెకు ఆఫర్లు మాత్రం తెలుగులో పెద్దగా రావడం లేదు.

ఈ విషయంపై శ్రీదివ్య స్పందిస్తూ టాలెంట్‌ను గుర్తించడంలో కోలీవుడ్‌ వారు ముందు ఉంటారని, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేస్తే తమిళ ప్రేక్షకులు ఆధరిస్తారు అంటూ చెప్పుకొచ్చింది.అదే సమయంలో తెలుగు ప్రేక్షకులు గ్లామర్‌ రోల్స్‌ చేస్తేనే ఇష్టపడతారని కూడా చెప్పుకొచ్చింది.

అయితే తాను మాత్రం గ్లామర్‌ పాత్రలకు దూరం అంటూ చెప్పేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube