బహుళజాతి కంపెనీకి ఎదురుదెబ్బ

దేశంలోకి బహుళజాతి కంపెనీలను రెడ్‌ కార్పెట్‌ వేసి ఆహ్వానించాలన్న ప్రభుత్వాల ప్రయత్నాలకు అప్పుడప్పుడు ఎదరుదెబ్బలూ తగులుతున్నాయి.తాజాగా ప్రపంచంలోనే అతి పెద్ద శీతల పానీయాల తయారీ కంపెనీ అయిన కోకాకోలాకు తమిళనాడులో ఎదురుదెబ్బ తగిలింది.

 Tamil Nadu Cancels Permission For Coca Cola Plant-TeluguStop.com

ఈ రాష్ర్టంలోని ఈరోడ్‌లో కంపెనీ ప్లాంటు పెట్టుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.అయితే ప్రజలు, రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు.ఎందుకు? కోకాకోలా కంపెనీ ప్లాంటు పెడితే భూగర్భ జలాలు అంతరించిపోతాయి.భూమిలో ఉండే నీటినంతటినీ కోకాకోలా జుర్రిపారేస్తుంది.

శీతల పానీయాలకు నీరే మూలాధారం కాబట్టి తమ ప్రాంతంలో నీరులేకుండాపోతుందని రైతులు, ప్ర జలు భయపడుతున్నారు.అయితే ప్రభుత్వం కంపెనీకి ప్రజావ్యతిరేకత గురించి చెప్పకుండా మీకు భూమి కేటాయించినా గడువులోగా మీరు ప్లాంటు నిర్మించలేదుకాబట్టి మీకు ఇచ్చిన అనుమతిని ఎందుకు రద్దు చేయకూడదో తెలియచేయాలని కంపెనీకి షోకాజ్‌ నోటీసు ఇచ్చింది.

కోకాకోలా కంపెనీకి ప్రభుత్వం డెబ్బయ్‌ ఒక్క ఎకరాల భూమి కేటాయించింది.ఐదొందల కోట్ల రూపాయల ఖర్చతో ప్లాంటు పెట్టాలని కోకాకోలా ప్లాన్‌ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube