వెరీగుడ్‌...మంచి పని చేశారు

కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఆమెను అవమానించిన కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ఎట్టకేలకు పార్లమెంటులో క్షమాపణ చెప్పారు.తప్పుచేసినవారు క్షమాపణ చెప్పడం సంస్కారం అనిపించుకుంటుంది.

 Minister Giriraj Singh Apologises In Parliament-TeluguStop.com

సభలోనూ మొండికేయకుండా క్షమాపణ చెప్పడంతో కాంగ్రెసు కూడా ఈ వివాదానికి స్వస్తి పలికితే మంచిది.గిరిరాజ్‌ సింగ్‌ కొన్ని రోజుల కిందట సోనియాను ఉద్దేశించి ఆమె (సోనియా) తెల్ల తోలు మహిళ కాబట్టి తమ పార్టీ అధ్యక్షురాలిగా కాంగ్రెసు నాయకులు అంగీకరించారని, ఒకవేళ రాజీవ్‌ గాంధీ నైజీరియా మహిళను వివాహం చేసుకొని ఉంటే అధ్యక్షురాలిగా ఆమెను అంగీకరించేవారా? అని ప్రశ్నించారు.ఇలా రంగు పేరుతో ఓ మహిళను గేలి చేయడం తప్పు కదా.దీంతో కాంగ్రెసు నాయకులు ఫైరయ్యారు.సోమవారం రెండో విడద బడ్జెటు సమావేశాలు ప్రారంభం కాగానే దీనిపైనే గొడవ చేశారు.గిరిరాజ్‌ను డిస్మిస్‌ చేయాలని, ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.మంత్రి వెంకయ్య నాయుడు కూడా మంత్రి వ్యాఖ్యల పట్ల విచారం వెలిబుచ్చారు.ప్రధాని మోదీ ఆదేశం మేరకే మంత్రి క్షమాపణ చెప్పి ఉంటారు.‘నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధించివుంటే క్షమాపణ చెబుతున్నాను’ అని గిరిరాజ్‌ సభలో చెప్పారు.మంత్రలు నోరు అదుపులో పెట్టుకొని బాధ్యతగా మాట్లాడాలిగాని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించకూడదు.

ఈ విషయం మోదీ తన మంత్రులకు గట్టిగా చెబితే మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube