రాహుల్‌ ఏం చెబుతాడు?

యాభైఏడు రోజుల పాటు విదేశాల్లో ఉండి తిరిగొచ్చిన కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఏం మాట్లాడతారు? అనే దాని గురించి అన్ని పార్టీలు, మీడియా ఎదురుచూస్తున్నాయి.కాంగ్రెసు నాయకులు కూడా ఆయన ఏం చెబుతాడోనని ఆసక్తిగా ఉన్నారు.

 There Was No Official Word On Where Gandhi Had Spent-TeluguStop.com

ఆయన విదేశాలకు వెళ్లినట్లు నిర్ధారణ అయిందిగాని ఎక్కడెక్కడి వెళ్లాడు? ఏం చేశాడు? అనేది తెలియలేదు.రాహుల్‌ ఇప్పటివరకు పెదవి విప్పకపోయినా పార్టీలోని ఆయన భజనపరులు ఆయన్ని వెనకేసుకొని వస్తున్నారు.

ఆయన మాట్లాడకపోతే ఇతరులకు ఏమిటి సమస్య? అని మాజీ వాణిజ్య శాఖ మంత్రి ఆనంద్‌ శర్మ ప్రశ్నించారు.మరో కాంగ్రెసు నాయకుడు సచిన్‌ పైలట్‌ కూడా రాహుల్‌ని సమర్థించారు.

పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో, కీలక బిల్లులు ప్రవేశపెట్టిన తరుణంలో రాహుల్‌గాంధీ ‘అధ్యయనం’ పేరుతో దాదాపు రెండు నెలలు దేశంలో లేకుండా పోవడంతో సీనియర్‌ కాంగ్రెసు నాయకులు చాలా మంది విమర్శలు గుప్పించారు.దీనికి రాహుల్‌ గాంధీ బాధపడ్డారట.

సెలవులో వెళ్లే హక్కు ప్రతివారికీ ఉంది అని అన్నారట.నిజమే.

ఉంది.కాని పాదర్శకంగా ఉండకుండా, ఏ సమాచారమూ లేకుండా ఎందుకు వెళ్లిపోయారనేదే ప్ర శ్న.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube