ఛాంపియన్‌ ఆఫ్‌ ఛేంజ్‌

ఛాంపియన్‌ అనగానే మనకు క్రీడాకారులు గుర్తొస్తారు.క్రీడాకారులనే ఛాంపియన్‌ అనాల్సిన అవసరంలేదు.

 Microsoft Ceo Satya Nadella To Receive Champion Of Change Award-TeluguStop.com

విజయం సాధించేవారే ఛాంపియన్లు కాదు.మార్పు తెచ్చేవారు కూడా ఛాంపియన్లే.

మార్పు తేవడం కూడా విజయమే కదా.ఈ మార్పు తెచ్చిన వ్యక్తి ఎవరు? తెలుగువాడిగా పుట్టి, అమెరికాలో స్థిరపడి, ప్రపంచ ప్రఖ్యాత మైక్రోసాఫ్‌్ట కంపెనీకి ప్రధాన కార్యనిర్వహాణాధికారిగా (సీఈఓ) పనిచేస్తున్న సత్య నాదెళ్ల.ఈయనకు ‘ఛాంపియన్‌ ఆఫ్‌ ఛేంజ్‌’ అవార్డు ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా నిర్ణయించుకున్నారు.ఎందుకు ఈ అవార్డు ఇవ్వాలనుకుంటున్నారు? అమెరికాలో మైక్రోసాఫ్‌్టతో కలిసి పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రతి ఏడాది పదిహేను రోజులపాటు జీతంతో కూడిన సెలవు ఇవ్వాలని సత్య నాదెళ్ల నిర్ణయించారు.ఇదో పెద్ద మార్పు.వచ్చే ఏడాది నుంచి దీన్ని అమలు చేస్తారు.

ఇది ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన అంశం.తీరిక లేకుండా పనిచేసే సాఫ్‌్టవేర్‌ ఉద్యోగుల జీవితాల్లో జీతంతో కూడిన రెండు వారాల సెలవు వరంలాటిది.

గత ఏడాది ఫిబ్రవరిలో సత్య నాదెళ్ల కంపెనీ సీఈవో కాకముందు ఎంటర్‌ప్రైజ్‌, కన్జూమర్‌ బిజినెస్‌లో సమర్థ నాయకత్వం అందించారు.ఇవి మాత్రమే కాదు ఇతర అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని సత్య నాదెళ్లకు అవార్డు ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు నిర్ణయించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube