వివాహంలో కాలిమట్టెలకు ఉన్న ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం  

Why Women Wearing Mettelu-

మన వివాహ వ్యవస్థలో వివాహం సమయంలో కాలిమట్టెలు తొడగటం అనేది అనాదిగా ఆచారంగా వస్తూ ఉంది.కాలిమట్టెలను బంగారంతో కాకుండా వెండితో తయారుచేస్తారు.ఎందుకంటే బంగారం ఎక్కువ రేటులో ఉండటం మరియు బంగారం లక్ష్మి స్వరూపం కాబట్టి కాలికి పెట్టకూడదనే ఉద్దేశంతో కాలిమట్టెలకు బంగారాన్ని ఉపయోగించరు.

వివాహం సమయంలో ఒక్కసారి మెట్టెలు పెట్టాక ఆ స్త్రీ ఎప్పటికి తీయరు.

Why Women Wearing Mettelu- Telugu Devotional Bhakthi(తెలుగు భక్తి ) Why Women Wearing Mettelu---

ఒకవేళ మెట్టెలు అరిగిపోతే కొత్తవి పెట్టుకుంటారు.వివాహంలో ప్రతి ఘట్టానికి ప్రాముఖ్యత ఉన్న విషయం తెలిసిందే.అలాగే మెట్టెలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది.కాలు బొటనవ్రేలుకు … రెండవ వ్రేలుకు మధ్య ఒరిపిడి జరగడం వలన, రక్త ప్రసరణ బాగా జరగడమే కాకుండా మనో వికారాలు నియంత్రించబడతాయి.

ఈ కారణంగానే మట్టెలు బొటన వ్రేలు పక్కన ఉన్న వ్రేలుకు పెడుతుంటారు.

పూర్వం గృహస్తులు … సాధువులు … యోగులు మొదలైన వారు పాదుకలు ధరించడంలోని ఆంతర్యం కూడా ఇదే.

భారత దేశంలో అందరు స్త్రీలు కుల మతాలకు అతీతంగా ఈ మెట్టెలను ధరిస్తారు.మెట్టెల ఉపయోగం ఉండాలంటే నాజూగ్గా ఉండేవి కాకుండా కొంచెం బరువుగా ఉండే మెట్టెలను ధరించాలి.

DEVOTIONAL