హాట్ యాంకర్ కి నందమూరి హీరోతో పోటి

బాక్సాఫీస్ వద్ద రష్మీ గౌతమ్ దండయాత్ర కొనసాగుతూనే ఉంది.గుంటూరు టాకీస్ కి తన గ్లామర్ వలన మంచి ఓపెనింగ్స్ వచ్చినా, ఆ తరువాత ఈ అమ్మడి కెరీర్ పూర్తిగా డవున్ అయిపోయింది.

 Rashmi Gautam Stands Against Kalyan Ram With Glamour-TeluguStop.com

తన గ్లామర్ క్రేజ్ ఏదో వన్ ఫిలిమ్ వండర్ లా అనిపించింది ట్రేడ్ విశ్లేషకులకి.అయినా, రష్మీ పట్టు విడవటం లేదు.

“తను వచ్చేనంట” అంటూ మరో హర్రర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తోంది.అది కూడా సోలోగా కాదు.

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన “ఇజం” విడుదల తేదిరోజే తన కొత్త చిత్రాన్ని విడుదల చేస్తోంది రష్మీ.తెలుగులో తొలి జాంబీ మూవి అన్న నమ్మకమో లేక తన గ్లామర్ ఆకట్టుకుంటుదన్న ఆత్మవిశ్వాసమో కాని, నందమూరి హీరోతో ఢీ కొడుతోంది.

ఇజం, తను వచ్చెనంటా .రెండూ అక్టోబరు 21వ తేదిన విడుదల అవుతున్నాయి.

మరి గుంటూరు టాకిస్ మాదిరిగా బాక్సాఫీసు దగ్గర రష్మీ మళ్ళీ చప్పుడు చేస్తుందో, లేక ఇజం దెబ్బకి జనాల దృష్టిలో పడకుండానే థియేటర్ల నుంచి వెళ్ళిపోతుందో చూడాలి.ఇక ఈ సినిమా కూడా అపజయాన్నే చవిచూస్తే, రష్మీ గ్లామర్ ఇమేజ్ కి కాలం చెల్లిందనే చెప్పాలేమో!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube