వీర్యం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాట్లు వద్దు

మగవారిని మగవారిగా పిలిచేందుకు కారణమే వీర్యం. మనుషుల జాతి ఈరోజు భూమి మీద ఇంతలా విస్తరించింది అంటే కారణం వీర్యం.ఇది చాలా గొప్పది.కాబట్టి దీన్ని కేవలం సెక్స్ కి పనికివచ్చే వస్తువుగా చూడొద్దు.వీర్యాన్ని గౌరవించండి.దాన్ని కాపాడుకోండి.

 Habits That Can Damage Your Sperm Count Details, Sperm, Sperm Count, Bad Habits,-TeluguStop.com

వీర్యకణాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లను మానెయ్యండి.

* మగవారిలో సిగరేట్లు తాగే అలవాటు ఉండటం చాలా సాధారణ విషయం అయిపోయింది.

కాని ఇది వీర్యకణాల ఉత్పత్తిని బాగా దెబ్బతీస్తుంది.స్పేర్మ్ కౌంట్, స్పెర్మ్ డెన్సిటి, మోర్టైల్ స్పెర్మ్ శాతం .అన్నిటినీ తగ్గించేస్తుంది ఈ అలవాటు.అంతేకాదు ఇది DNA పై కూడా దుశ్ప్రభావం చూపుతుంది.

* బయటకి కనిపించకుండా సెమెన్ ప్రొడక్షన్ ని దారుణంగా దెబ్బతీస్తుంది స్డ్రెస్.ఈ కారణంచేతనే అర్బన్ ఏరియాల్లో సరైన సంతానప్రాప్తి లేక ఇబ్బందిపడుతున్నారు పురుషులు.

* WiFi కనెక్షన్ ఆన్ చేసి ల్యాప్ టాప్ లాంటివి ఎక్కువసేపు వాడొద్దు.ఈ వైర్ లెస్ కనెక్షన్లు స్పెర్మ్ మొటిలిటిని ఘోరంగా దెబ్బతీస్తుందని ఇప్పటికే చాలా పరిశోధనలు తేల్చిచెప్పాయి.

రేడియో ఫ్రిక్వెస్సి, ఎలక్ట్రో మెగ్నెటిక్ రేస్.ఇవన్ని వీర్యానికి చేటు చేసేవే.

Telugu Bad Habits, Healthy Sperm, Speram, Junk, Sperm, Sperm Count, Sperm Densit

* మద్యపానం నిజంగా తీవ్రమైన రీతిలో వీర్య ఉత్పత్తిని దెబ్బతీస్తుంది.Azoospermia, Cryptozoospermia లాంటి పెద్ద పెద్ద సమస్యలను కూడా తెచ్చిపెట్టగలదు అధిక మద్యపానం.అదే జరిగితే అసలు మొటైల్ స్పెర్మ్ అనేది స్కలనంలో కనిపించకుండా పోతుంది.ఇంకోరకంగా చెప్పాలంటే తండ్రి అయ్యే యోగ్యత కోల్పోవడం.

* ప్రాసెస్డ్ మీట్, ప్రాసెస్డ్ ఫుడ్ శరీరంలోకి ఎక్కువగా చేరినాకొద్ది వీర్యం యొక్క ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది.కాబట్టి జంక్ ఫుడ్ పై ఎక్కువగా ఆధారపడకూడదు.

అలాగే యాంటిఆక్సిడెంట్స్, ఫైబర్, విటమిన్ సి, లైసోపెన్, ఫోలేట్ లాంటి న్యూట్రింట్స్ శరీరానికి తక్కువగా అందితే కూడా వీర్యానికి ప్రమాదమే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube