గర్భిణీలు ఖచ్చితంగా తినాలి ఇది!

గ్రీన్ ఆపిల్ ని ఎక్కువగా చూసి ఉండం మార్కేట్లో.రుచిలో కాని, న్యూట్రింట్స్ లో కాని ఇది రెడ్ ఆపిల్ కి కొంచెం భిన్నంగా ఉంటుంది.

 Green Apple – A Blessing For Pregnant Women-TeluguStop.com

గర్భిణీలు ఈ గ్రీన్ ఆపిల్ ని ఖచ్చితంగా తినాలి.ప్రెగ్నెంట్ లేడిస్ కి ఎన్నోరకాలుగా ఉపయోగపడుతుంది ఈ గ్రీనగ ఆపిల్.

* గర్భిణిలకు బలం చాలా అవసరం.అప్పుడే తల్లీ, బిడ్డ .ఇద్దరు ఆరోగ్యకరంగా ఉంటారు.గ్రీన్ ఆపిల్ లో బలానికి అవసరమైన కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి.

* గ్రీన్ ఆపిల్ లో న్యూట్రింట్స్ ఎక్కువగా లభిస్తాయి.ఇందులో విటమిన్ సి, ఏ, బి6 తోపాటు ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం లాంటి మినరల్స్ దొరుకుతాయి.

* గర్భిణీల కాలేయంలో ఆసిడ్స్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటాయి.దీంతో ప్రీమెచ్యుర్ బర్త్ లాంటి పెద్ద సమస్యే కాదు, ఎన్నోరకాల చిన్ని చిన్ని ఇబ్బందులు కూడా చూడాల్సివస్తుంది.

కాలేయం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు అంటే గ్రీన్ ఆపిల్ ని తినటం ఉత్తమం.

* గర్భం ధరించటంతో అందాన్ని కోల్పోయామని బాధపడిపోతుంటారు కొందరు స్త్రీలు.

అలాంటివారికి గ్రీన్ ఆపిల్ చక్కటి నేస్తం.ఇది చర్మాన్ని సంరక్షిస్తూనే, చర్మసౌందర్యాన్ని మరింత పెంచుతుంది.

* జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను సర్వసాధారణంగా చూస్తుంటారు గర్భంతో ఉన్న మహిళలు.రోజూ గ్రీన్ ఆపిల్ తినే అలవాటు ఉంటే జీర్ణక్రియ బాగా మెరుగవుతుంది.

ఎందుకంటే దీంట్లో డైటరీ ఫైబర్ బాగా దొరుకుతుంది.

* బ్లడ్ ప్రెషర్ సమస్యల నుంచి గర్భిణీలు ఉపశమనం పొందాలంటే విటమిన్‌ సి ఇంటేక్ మంచి మార్గం.గ్రీన్ ఆపిల్ లో మరీ ఎక్కువగా కాకపోయినా, ప్రతి 100 గ్రాములకి 4.6 మిల్లిగ్రాముల విటమిన్ సి దొరుకుతుంది.

* గర్భం ధరించిన సమసయంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచడం కష్టమైన పనే.కాని గ్రీన్ ఆపిల్ ఆ పని చేసి పెడుతుంది.

* గ్రీన్ ఆపిల్ యాంటిఅక్సిడెంట్స్ ఎక్కువ.ఇది నొప్పులు, ఇంఫెక్షన్లు .ఇతర ఆరోగ్య సమస్యలతో శక్తిమేర పోరాడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube