ఒక్క హార్మోన్ ని చెడగొట్టి, మొబైల్ మనతో 8 రకాలుగా ఆడుకుంటోంది

మనం నవ్వుతున్నాం అంటే అది హార్మోన్స్ యొక్క ప్రభావమే.ఏడుస్తున్నాం అంటే అది హార్మోన్స్ వలనే.

 8 Ways Mobile Phone Disturbs Melatonin And Ruins Human Life-TeluguStop.com

నిద్రపోతున్నాం అంటే కూడా అది హార్మోన్స్ వలనే.నిద్ర గురించి మాట్లాడుకుంటున్నాం కాబాట్టి, మెలటోనిన్ అనే హార్మోన్ గురించి ఎప్పుడైనా విన్నారా ? ఇప్పుడు చాలామంది నిద్రపట్టక, మెలటోనిన్ అందించే మందులు వాడుతున్నారు.నిద్ర కోసం తపిస్తున్నాడు మనిషి.ఎలాంటి రోజులు వచ్చాయి చూడండి.దీనికి ప్రధాన కారణం సెల్ ఫోన్.ఎలాగో మీరే చూడండి, అలాగే అది మన జీవితంలో తీసుకొస్తున్న హానికరమైన మార్పులు చూడండి.

* మొబైల్ ఫోన్ ని అదేపనిగా వాడండి.కనులు మంటపెడతాయి.

ఎందుకంటే మొబైల్ ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్, మన బ్లింకింగ్ రేట్ ని తగ్గించేస్తుంది.అంటే మనం మనం కనులు రెప్ప వేయటం తగ్గిస్తాం.

దీంతో చూపు దెబ్బతింటుంది.ఆలాగే కనులు మంటపెడతాయి.

బరువుగా అనిపిస్తాయి.

* మేలాటోనిన్ పై ప్రభావం చూపి, నిదురని దూరం చేస్తుంది.

దీంతో ఇన్సొమ్నియా వస్తుంది.గత దశాబ్దకాలంలో ఇన్సొమ్నియా కేసులు 70% పెరిగాయి.

అంటే మనిషి రోజురోజుకి నిద్రకు దూరం అవుతున్నాడు.

* మెలాటోనిన్ మీద ప్రభావం చూపడం ద్వారా, మన ఆకలిని కంట్రోల్ చేసే హార్మోన్స్ పై కూడా మొబైల్ ఫోన్ చెడు ప్రభావం చూపుతుంది.

అందుకే మనకు సమయానికి తిండి తినబుద్ధి కాదు.ఇంత సైన్స్ ఎందుకు అనుకుంటే, మొబైల్ మీద ఆసక్తి వలన తిండి మీద ధ్యాస తగ్గుతుంది.

అతిబరువు, బరువు తరుగుదల .ఏదైనా జరగవచ్చు.

* ఇలా రోజు సమయానికి పడుకోకపోవడం వలన కొన్నిరోజులకి న్యోరో’టాక్సిన్ బిల్డప్ కి దారి తీస్తుంది మొబైల్ లైట్.ఆ తరువాత మనిషి ఎంత ప్రయత్నించిన త్వరగా నిద్రపోలేడు.

ఈ సమస్య తీవ్రమైన కొద్ది, అందం, ఆరోగ్యం .రెండు క్షీణిస్తాయి.

* మేలాటోనిన్ పై సెల్ ఫోన్ దుష్ప్రభావం వలన కోలాన్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రభావం చాలావరకు పెరిగిపోతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

* మళ్ళీ మెలాటోనిన్ హార్మోన్ ని దెబ్బతీస్తూ, మెల్లిగా మనిషిని స్ట్రెస్ లోకి, ఆ తరువాత డిప్రెషన్ లోకి తోస్తోంది మొబైల్ ఫోన్ లైట్.

ఇది చిన్న సమస్య లాగా అనిపిస్తున్నా చిన్న సమస్య కాదు.మనిషి డిప్రెషన్ లోనే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు.

* ఇదే హార్మోన్ లెవల్స్ లో ఇమ్బ్యాలేన్స్ వలన మనిషి యొక్క ఫోకస్, అంటే విషయాలని గమనించే తీరులో మార్పులు వస్తాయి.ఏది త్వరగా అర్థం చేసుకోలేకపోతాడు.

అందుకే నేర్చుకునే ఆసక్తి తగ్గుతోంది రాను రాను.

* ఇక మెలాటోనిన్ పై ప్రభావం వలన బ్రెయిన్ సెల్స్ దారుణంగా దెబ్బతింటాయి.

ఇక్కడే జ్ఞానపశక్తి తగ్గేది.ఇది అర్థం చేసుకోవడానికి సైన్స్ అవసరం లేకున్నా, సైన్స్ తో పాటు చెబితే బాగా అర్థం అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube