స్పైడర్ ఫ్లాప్ అవడానికి 8 ప్రధాన కారణాలు

ఏడాదిన్నరగా ఊరించి ఊరించి వచ్చిన స్పైడర్ నెగటివ్ టాక్ సంపాదించుకుంది.కాని తెలుగులో మాత్రమే‌.

 8 Reasons Why Spyder Is Set To Become A Flop-TeluguStop.com

తమిళంలో సినిమా టాక్ బానే ఉంది.ఇలా ఎందుకు? ఒకే సినిమా ఒక భాషలో హిట్ సూచికలు చూపిస్తోంటే, అదే సినిమా తెలుగులో ఎందుకు ఇంత ఘోరమైన టాక్ తెచ్చుకుంది.స్పైడర్ ఫలితానికి కారణం ఏమిటి? మా ప్రకారం 10.మీరేం అంటారు?

1) ఈ కథ మహేష్ బాబు ఎంచుకోవడం.విలన్ హీరోని డామినేట్ చేసే కథ ఇది.ఇంటలీజెన్స్ ఆఫీసర్ అంటే దేశంలోనే పెద్ద సమస్యలను డీల్ చేస్తాడు అనుకుంటాం.కాని ఇక్కడ ఒక సైకో కిల్లర్ ని డీల్ చేస్తారు.బేసిక్ గా, మహేష్ బాబు స్థాయికి తగ్గ కథ కాదు.

2) బడ్జేట్ అవసరానికి మించి పెట్టేసారు.ఇదే సినిమాని 50 కోట్లలో పూర్తి చేసి ఉంటే, 80-90 కోట్లకి అమ్మేసుకునేవారు.

నష్టాలు తక్కువ వచ్చేవి.డిజాస్టర్ భయం ఉండేది కాదు.అలాగే అంచనాలు తక్కువ ఉండేవి.

3) జనాల్ని మోసం చేసిన ప్రోమోలు.రోబోటిక్ స్పైడర్ కి ఈ సినిమాలో స్థానమే లేదు.కేవలం ప్రోమోలో చూపించి డిజపాయింట్ చేసారు.‌ హాలివుడ్ సినిమా స్థాయిలో ప్రొజెక్ట్ చేసి మళ్ళీ దక్షిణాది సినిమానే చూపించారు.మహేష్ బాబుని పెద్ద ఆఫీసర్ లా ప్రొజెక్ట్ చేసారు.

కాని తను ఐబి ఆఫీస్ లో ఓ చిన్న ఉద్యోగి.ప్రోమోలో చూపించిన ఫైట్స్ కేవలం ఓ పాటలో చుట్టేసారు. 4) ఇది అందరికి ఆసక్తి పుట్టించే మాస్ సినిమా కాదు.ఏ ఒక్క వర్గాన్ని కూడా ఆకట్టుకోకపోవడం మరీ దారుణం.

5) మహేష్ బాబు ఇక్కడ పెద్ద స్టార్.అందుకే మహేష్ క్యారెక్టర్ అండర్ ప్లేలో ఉంటే ప్రేక్షకులు నీరసంగా ఫీల్ అయ్యారు.

తమిళ ప్రేక్షకులకి మహేష్ బాబు సూపర్ స్టార్ కాదు.విలన్ డామినేట్ చేసినా, వారికి అలాంటి ఇబ్బంది ఉండదు.

6) తమిళ వాసన.మహేష్ తమిళ సినిమా చేసి దాన్ని ఇక్కడ డబ్బింగ్ చేసినట్లు ఉంది సినిమా.

మన నేటివిటి ఛాయకు కూడా కనిపించలేదు.ఏదో తమిళ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ మొదటి సీన్ నుంచే మొదలవుతుంది.

7) రెండు భాషల్లో చిత్రీకరించడం వలన 120 కోట్లు సరిగా వినియోగించుకోలేకపోయారు.గ్రాఫిక్స్ పేలవంగా ఉన్నాయి‌‌.యాక్షన్ ఎపిసోడ్లు ప్రేక్షకులకి బోర్ కొట్టించాయి.

8) ఒక్క ముక్కలో చెప్పాలంటే, మురుగదాస్ సినిమాని బాగా తీయలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube