మహిళల్లో భావప్రాప్తి గురించి పురుషులు తెలుసుకోవాల్సిన విషయాలు

భావప్రాప్తి .కొన్ని సెకన్లపాటు ఈ భావాన్ని పొందడం కోసం మనిషి వందల కాలరీలు ఖర్చు చేస్తూ, చెమట చిందిస్తూ, ఎనర్జీని బయటకి తీస్తూ కష్టపడతాడు.

 8 Important Things About Female Orgasm Every Man Should Know-TeluguStop.com

భావప్రాప్తి అనేది పురుషుడికి అయినా, స్త్రీకి అయినా, ఒక అల్టిమేట్ అనుభవం.ప్రపంచంలో ఇంతకంటే గొప్ప అనుభవం, అనుభూతి ఉంటుందా అనిపిస్తుంది.

స్త్రీ, పురుషులలో పోల్చుకుంటే స్త్రీలలో భావప్రాప్తి మరింత అద్భుతంగా ఉంటుందని డాక్టర్లు చెబుతారు.భావప్రాప్తి విషయంలో స్త్రీల పక్షాన నిలిచాడు దేవుడు.

పురుషులతో పోల్చుకుంటే ఎక్కువసేపు ఆ అనుభవాన్ని అనుభవించేది స్త్రీలే, వరుసపెట్టి స్వర్గాన్ని చూడగలిగేవారు కూడా స్త్రీలే.కాని స్త్రీ భావప్రాప్తి గురించి సమాచారం ఇక్కడితో ఆగదు.

ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.వాటిలో మగవారు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇవి.

* పాత విషయమే కాని మళ్ళీ చెప్పాలి.స్త్రీలు ఒకే సెషన్ లో పలుమార్లు భావప్రాప్తి పొందగలరు.

శృంగారంలో ఆమె ఆసక్తిని బట్టి గంటకి రెండు నుంచి నాలుగు సార్లు కూడా స్త్రీ భావప్రాప్తి పొందగలదు.

* సగటున స్త్రీ భావప్రాప్తి 20 సెకన్ల పాటు ఉంటుంది.

ఈ లెక్క అటు ఇటుగా మారొచ్చు కూడా.కాని పురుషులతో పోల్చుకుంటే ఇది ఎక్కువే.

* 70 శాతం స్త్రీలు వజైనల్ పెనట్రేషన్, అంటే శృంగారంలోని మెయిన్ యాక్ట్ వలెనే భావప్రాప్తి పొందుతున్నారట.కాని స్త్రీలు భావప్రాప్తి పొందడానికి కేవలం మెయిన్ యాక్ట్ అవసరం లేదు.

ఫోర్ ప్లే బాగుంటే అప్పుడే భావప్రాప్తి పొందుతారు.* ఒక పాపులర్ అపోహ ఏమిటంటే, జీ స్పాట్ ని ప్రేరేపిస్తే తప్ప స్త్రీలు భావప్రాప్తి పొందలేరు అని.కాని అది నిజం కానే కాదు.ప్రతి స్త్రీ ఒకేలా స్పందించదు.

జీ స్పాట్ అవసరం లేకుండానే భావప్రాప్తి పొందతున్న స్త్రీలు ఎంతోమంది.

* స్త్రీలకు అతిసులువుగా భావప్రాప్తి ఇవ్వగలిగే మార్గం క్లిటోరిస్ ని ప్రేరేపించడం.8 వేలకు పైగా నేర్వ్ ఎండింగ్స్ ఉండటం వలనేమో, ఇక్కడ ఈజీగా కనెక్ట్ అయిపోతారు స్త్రీలు.

* యుక్త వయస్సులో కంటే సులువుగా, ఎక్కువగా మధ్య వయసులోనే భావప్రాప్తి పొందుతారు స్త్రీలు.

వయసుతో పాటు భావప్రాప్తిలో అనుభూతి పెరుగుతుంది.

* భావప్రాప్తి స్త్రీలలో ఎన్నోరకాల నొప్పుల్ని పోగొడుతుంది.

తలనొప్పి, కడుపునొప్పి నుంచి పీరియడ్స్ లో క్రామ్ప్స్ వరకు, ఎన్నోరకాల నొప్పులపై భావప్రాప్తి పెయిన్ కిల్లర్ లా పనిచేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube