మద్యం మీద ప్రచారంలో ఉన్న పచ్చి అబద్ధాలు ఇవి

మంచి నీళ్ళు, టీ (మిల్క్ టీ ఒక్కటే కాదు, హర్బల్ టీ లాంటివి కలుపుకొని), వీటి తర్వాత మద్యం (బీర్).విస్కీ, బ్రాండి, బీర్ అనే తేడాలు చూడకుంటే, ప్రపంచంలో అత్యధికంగా సేవించబడే మూడోవ ధ్రవపదార్థం మద్యం.

 8 Biggest Myths Around Alcohol-TeluguStop.com

దీనికి ఆల్కహాల్ అనే పేరు ఇప్పుడు వచ్చినా, వేల సంవత్సరాలుగా ఈ పానీయం మండుబాబులని మత్తులో ముంచుతూనే ఉంది.వేల సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టే దీని మీద ఎన్నో అపోహలు కూడా పుట్టుకొచ్చాయి.

ఇప్పటికి కూడా కొన్ని ప్రచారంలో ఉన్నాయి.ఆ అపోహలు ఏంటో .అసలైన నిజాలు ఏంటో చూడండి.

* ఆల్కహాల్ ని ఎనర్జీ డ్రింక్స్ తో కలిపి తాగితే మంచిదని అనుకుంటారు.

నిజానికి ఆల్కహాల్ కి ఎనర్జీ డ్రింక్స్ లో ఉండే ఆర్టిఫిషియల్ షుగర్స్, కేఫైన్ ఎప్పుడు కలవకూడదు.ఇది చాలా ప్రమాదకరం.

* బీరు తాగితే బరువు పెరుగుతారు అని అదో అపోహ.బీరు మాత్రమే కాదు, ఏ మద్యం తాగినా బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి.

కాని అవి బీర్ లో ఫ్యాట్స్ వలన కాదు, ఎందుకంటే అందులో ఫ్యాట్స్ ఉండవు.మద్యం వలన మెటబాలిజం రేటు దెబ్బతిని కొవ్వు జమ అవుతుంది.

* వైన్ ఎంత పాతదైతే అంత మంచిది అంటారు.ఇది ప్రతీసారి నిజం కాకపోవచ్చు.

ఇది వైన్ రకాలను బట్టి మారుతూ ఉంటుంది.కొన్ని రకాల వైన్స్ పాతబడ్డాక యాంటిఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ని కోల్పోతాయి.

* మద్యం తాగడానికి ముందు పెయిన్ కిల్ల్లర్స్ వాడితే తలనొప్పి రాదు అని అనుకుంటారు.కాని మద్యం తాగడానికి ముందు ఎప్పుడు పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదు.అలా చేస్తే బ్లడ్స్టీం లోకి మద్యం మరింత ఎక్కువగా వెళుతుంది.

* మద్యం బ్రెయిన్ సెల్స్ పై డైరెక్టుగా ఎటాక్ చేస్తుందనేది కూడా ఓరకంగా అపోహే.

మద్యం బ్రెయిన్ సెల్స్ చంపేయదు.కాని దేన్ద్రిట్స్ డ్యామేజ్ చేస్తుంది.

కాబట్టి మెదడుకి మద్యం ఎక్కువగా సేవించడం మంచిది కాదు.

* డార్క్ రంగుల్లో వచ్చే బ్రాండ్స్ ఆరోగ్యానికి మంచివని చెబుతారు.

ఇది కూడా నిజం కాదు.నిజానికి అలాంటి బ్రాండ్స్ లోనే టాక్సిన్స్ ఎక్కువ ఉండవచ్చు.

* మందు తాగాకే భోజనం చేయాలి అనే వింత వాదన కొందరిది.ఇది ఏమాత్రం మంచి పధ్ధతి కాదు.

మందు మొదలుపెట్టడానికి ఓ రెండు గంటల ముందే తినాలి.కడుపులో ఉన్నది ఉన్నట్టు కక్కుకునేవారికి ఇంత చిన్న లాజిక్ కూడా అర్థం కాదు ఎందుకో.

* నిద్ర సుఖమైన పట్టడానికి మద్యం ఓ మార్గం అనుకోవడం కూడా అపోహే.మద్యం మత్తులో త్వరగా నిద్రపడుతుందేమో కాని, బ్లాడర్ సమస్యలు, మంట వలన సుఖమైన నిద్ర పట్టడం కష్టమే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube