వ్యాధుల్ని మోసుకొచ్చే ఏడు కామన్ అలవాట్లు

మనిషి అంటే రకరకాల అలవాట్లు ఉంటాయి.ఒక మనిషికి ఉండే అలవాటు మరో మనుషికి ఉండకపోవచ్చు, కొన్ని అలవాట్లు కలవచ్చో, మరికొన్ని కలవకపోవచ్చు .

 7 Common Habits That Can Harm Your Health-TeluguStop.com

అలవాట్లు ఎలా ఉన్నా, వాటి వలన మనం కాని, మన పక్కవారు కాని నష్టపోకుండా ఉంటే చాలు.కాని మంచి అలవాట్లు మనుషులకి ఉండవు, ప్రమాదకరమైన అలవాట్లు, చెడు అలవాట ఉంటాయి.

వ్యాధులకి, అనారోగ్యాన్ని మోసుకొచ్చే అలవాట్లనే మానుకోలేకపోతారు జనాలు.ఇక్కడ వ్యాధులని మోసుకొచ్చే అలవాట్లు అంటే కేవలం ధూమాపానం, మద్యపానం మాత్రమే కాదు.

కొన్ని కామన్ అలవాట్లు కూడా మనం ఊహించినదానికంటే ప్రమాదకరం.అలాంటి అలవాట్లలో కొన్ని చూడండి ఇక్కడ.

* కొందరికి పొద్దున్న టిఫిన్ వదిలేయడం అలవాటు.అలా చేయడం వలన మెటబాలిజం రేట్ దెబ్బతింటుంది.

మధ్యాహ్నం ఎక్కువ తినాల్సివస్తుంది.ఇది జీర్ణశక్తికి మంచిది కాదు.

* హై హీల్స్ వేసుకోవడం అంటే అమ్మాయిలకి భలే ఇష్టం.కాని అది పాదాల మీద అధిక ప్రెషర్ ని తీసుకొచ్చి, కీళ్ళనొప్పులు, వెన్నునొప్పికి కారణమవుతుంది.

* దుప్పటి నిండుగా కప్పుకోని నిద్రపోవడం కొందరికి అలవాటు.దీని వలన ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా అందుతాయి ఒంటికి.

మెదడుకి ఈ అలవాటు హాని చేస్తుంది.

* తక్కువ డబ్బులకి వస్తున్నాయి కదా అని చీప్ సన్ గ్లాసెస్ వాడొద్దు.

ఇవి యూవి రేస్ ని మీ కనులని కాపాడటం పక్కనపెడితే, రెటినల్ బర్న్ కి కారణమవుతాయి.

* గోళ్ళు కొరకడం చాలా చెడ్డ అలవాటు.టెన్స్డ్ గా ఉన్నప్పుడు, ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు ఇలా చేస్తారు జనాలు.దీనివలన గోటిలో ఉన్న బ్యాక్టీరియా అంతా లోనికి వెళుతుంది.

* కేవలం 4-5 గంటలు పడుకోవడం మరికొందరి అలవాటు.నిద్రలేమి వలన శారీరకంగా, మానసికంగా లెక్కలేనన్ని సమస్యలు వస్తాయి.

ఇన్సోన్మియా ఒక్కటే, స్ట్రెస్ కి, అందం తగ్గడానికి ఇంకెన్నో ప్రాబ్లమ్స్ కి కారణమవుతుంది.

* రోజుకి నాలుగైదుసార్లు సబ్బుతో ముఖం కడుక్కోవడం కూడా మంచి అలవాటు కాదు.

దీనివలన మీ చర్మంలోని నేచురల్ ఆయిల్స్ దెబ్బతిని చర్మవ్యాధులు వస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube