Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

60 ఏళ్ల భర్త ఓ విధవరాలిని రేప్ చేస్తోంటే, భార్య విడియో తీసింది -60 Year Old Man Rapes A Widow While His Wife Was Recording The Video

ఏ భార్య అయినా, తన భర్త తనతోనే ఉండాలి, తనకోసమే ఉండాలి, బెడ్ రూమ్ తో సహా అన్ని తనతోనే పంచుకోవాలి అని కోరుకుంటుంది. కాని ఇక్కడ ఓ భార్య చాలా వెరైటి. ప్రపంచంలో ఏ భార్య చేయని పని చేసింది. తన భర్త మరో ఆడదానిపై మానభంగం చేస్తోంటే, బుద్ధి చెప్పాల్సింది పోయి, తననే ప్రోత్సహించింది. ఆ దృశ్యాలని షూట్ చేస్తూ రికార్డు చేసింది. అక్కడితో ఆగకుండా, ఆ విడియోతో ఆ స్త్రీని బెదిరించడం మొదలుపెట్టింది.

వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లాకి చెందిన జీ. సత్యనారాయణ వయసు 60. అతని భార్య వసంత మధ్య వయసులో ఉన్న మహిళ. వీరి ఇంటికి భర్తను కోల్పోయిన ఓ 38 ఏళ్ల స్త్రీ (పేరు గోప్యం) వస్తూ ఉండేది. ఆవిడకి ఒక ఫ్యాన్సీ స్టోర్ ఉంది అంట. ఆ దుకాణం కోసం ఈ సత్యనారాయణ దగ్గర 80,000 అప్పు తీసుకుంది. ఎంతైనా సమయానికి సహాయం చేసిన చేసిన కుటుంబం కదా. పైగా భర్త లేని ఒంటరి జీవితం. దాంతో ఆ భార్యాభర్తలతో బాగా కలిసిపోయింది ఆ స్త్రీ.

మూడు నెలల క్రితం ఆరోజు తనని ఇంటికి రమన్నారట. ఫ్రెండ్లీగా మద్యపానం చేయించారట. ఆ తరవాత సత్యనారాయణ ఆమెని శారీరకంగా లోబరుచుకునే ప్రయత్నం చేసాడు. దీనికి వసంత కూడా సహాయం చేసింది. బలవంతంగా ఆమెపై సత్యనారాయణ మానభంగం చేస్తోంటే, ఆ విడియోని తన మొబైల్ లో రికార్డు చేసిందట వసంత. అప్పటినుంచి ఆ విడియో చూపిస్తూ ఆమెని మానసికంగా వేధించడం మొదలుపెట్టారు. బయటకి చెప్తే విడియో బయటపెడతాం అంటూ భయపెడుతూ, తనతో శృంగారం చేయాలని ఇబ్బందిపెట్టేవాడట సత్యనారాయణ. కాని ఈ మహిళ ఎప్పుడూ ఆ బెదిరింపులకి లొంగలేదట. అయితే ఈమధ్య కాలంలో వేధింపులు పెరిగిపోవడంతో, మొత్తానికి పోలీసులని ఆశ్రయించింది.

ఖానాపూర్ హవేలీ పోలీస్ స్టేషన్ లో కేస్ ఫైల్ చేసింది. సబ్ ఇన్స్పెక్టర్ నరేంద్ర చారి ప్రకారం సత్యనారాయణ మీద సెక్షన్ 376 కింద కేసు బుక్ చేసారు. అతని భార్య వసంత మీద సెక్షన్ 107 కింద కేసు ఫైల్ చేసారు. అయితే వారిని ఇంకా అరెస్టు చేయలేదట. విచారాణ జరుపుతున్నారు. ఆ మహిళ ఇచ్చిన రిపోర్టు పూర్తిగా నిజమని తేలిన తరువాత అరెస్టు చేస్తారట.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts
To Top