పొట్టలో కొవ్వు పెరగడానికి 6 ముఖ్య కారణాలు

పొట్ట, బట్ట .మనిషి ముసలాడు అవుతున్నాడని సూచికలు అని చెప్పేవారు.

కాని ఇప్పుడు వయసులో ఉన్నవారికి కూడా ఈ సమస్యలు వస్తున్నాయి.పాతికేళ్ళు కూడా నిండని అబ్బాయిలు పొట్టేసుకోని రోడ్ల మీద తిరుగుతన్నారు.

పెళ్ళి ఈడుకొచ్చిన అమ్మాయిలు, పెళ్ళి కోసం తగ్గాల్సిందే అంటూ పొద్దున్నే రన్నింగ్ చేస్తూ తంటాలు పడుతున్నారు.అసలు ఈ పొట్ట ఎందుకు వస్తుంది? సమస్య ఒకటే అయినా, కారణం ఒకటే ఉండదు.నేను చాలా తక్కువ తింటాను, అయినా పొట్ట వస్తోంది అని కంప్లయింట్ చేసేవాళ్ళు చాలామందే ఉంటారు.అలాంటప్పుడు మీ పొట్టకి అసలు కారణం ఏమిటో తెలుసుకోవాలి.అప్పుడే పరిష్కారం వెతకవచ్చు.అందుకే పొట్ట రావడానికి కారణమయ్యే 8 ముఖ్య విషయాల్ని మీ ముందు పెడుతున్నాం.

1) జీన్స్ పొట్టకి కారణమవుతుంది.మీ పేరెంట్స్ కి పొట్ట ఉంటే అది మీకు కూడా రావొచ్చు.

ఎందుకంటే కార్టిసాల్ మరియు లెప్టిన్ ని రెగులేట్ చేసే జీన్స్ మీరు తల్లిదండ్రుల నుంచి పొందవచ్చు.వారిలాగే మీ పొట్టలో కూడా ఫ్యాట్ జమ అవుతుండవచ్చు.

2) ఫ్యాట్స్, షుగర్ అహారం తినడం వలన పొట్ట ఈజీగా పెరిగిపోతుంది.ఇష్టం కదా అనే పదే పదే స్వీట్లు తింటే, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, నూనె ఎక్కువ వాడే వంటలు, వైట్ రైస్ .ఇవి ఎక్కువ తింటూపోతే పొట్ట ఎందుకు రాదు?

3) మద్యపానం పొట్ట రావడానికి కారణం అవుతుంది.ఎందుకంటే ఇది కొవ్వు కరిగే ప్రాసెస్ నెమ్మదింపజేస్తుంది.

దాంతో ఎక్కువ కాలరీలు కొవ్వులాగా మన ఒంట్లోనే ఉండిపోతాయి.ఇది ఎక్కువ కడుపులో జరుగుతుంది కాబట్టి పొట్ట వచ్చేస్తుంది.4) ప్రోటిన్ సరిగా తినకపోవడం వలన కూడా పొట్ట వస్తుంది.ప్రోటీన్స్ ఉన్న ఆహారం కడుపు నిండిన ఫీల్ ని ఇస్తుంది.

ప్రోటీన్స్ లేని ఆహారం ఆ సెన్స్ ని ఇవ్వకపోవడం వలన ఇంకా తింటాం, ఇంకా తినాలనుకుంటాం.ఇంకేం, అతిగా తినడం వలన పొట్ట వస్తుంది.

5) కార్టిసాల్ లెవల్స్ , డిప్రెషన్ లెవల్స్ పెరిగిపోవటం వలన ఖచ్చితంగా పొట్ట వస్తుంది.కార్టిసాల్ హార్మోన్ తక్కువగా విడుదలయితే మంచిదే.

కాని ఎక్కువ విడుదల అయితే ఇది శరీరంలో కొవ్వు పెరిగేలా చేస్తుంది.అందకే డిప్రెషన్ లో ఉండేవారికి, ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్ లో ఉండేవారికి సులువుగా బట్టతో పాటు పొట్ట వస్తుంది.

6) ఇతర కారణాలు చెప్పాలంటే, శారీరక శ్రమ లేకపోతే పొట్ట వస్తుందని మీకు ఎలాగో తెలుసు.నిద్రలేమితో పాటు అతినిద్ర కూడా పొట్టకి కారణం అవుతాయి.

ఇక మెనోపాజ్ సమయంలో స్త్రీలు ఈ పొట్ట సమస్యలు చూడొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube