Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

అమ్మాయి కూడా మిమ్మల్ని ఇష్టపడుతోందని చెప్పడానికి 6 సంకేతాలు-6 Important Signs That She Is In Love With You

కేవలం అబ్బాయిలే అమ్మాయిలని ఇష్టపడతారా? అలాంటి రూల్ ఏం లేదు. ఒక జెండర్ వారికి అవతలి జెండర్ మీద ఆకర్షణ, ఇష్టం కలగటం చాలా సహజమైన విషయం. ఇందులో అబ్బాయిలు మాత్రమే చూడగలిగే దృష్టికోణం ఏమి లేదు. ఉన్న తేడా ఏమిటంటే, అబ్బాయిలు తమ ఫీలింగ్స్ ని అస్సలు దాచుకోలేరు. వెంటనే లేదా పెద్దగా ఓపిక పట్టుకుండానే బయటపెట్టేస్తారు. కాని అమ్మాయిలు అలా కాదు. వారి మనసులో ఏముందో, మెదడులో ఏముందో మరో అమ్మాయి కూడా కనిపెట్టడం కష్టం. అలాంటిది అబ్బాయిలకెలా అర్థమవుతారు. కాని ఓ అమ్మాయి ఓ అబ్బాయిని ఇష్టపడితే, కావాలనో, అనుకోకుండానో, చిన్న చిన్న సంకేతాలు పంపిస్తుంది. అవేంటో మీరే చూడండి.

* అమ్మాయిలు ఇక అబ్బాయిని నిజంగానే ఇష్టపడితే చాలా సందర్భాల్లో తన స్నేహితురాళ్ళకి చెప్పుకుంటారు. అదే జరిగితే, అబ్బాయి కనబడగానే అమ్మాయి స్నేహితులు తనని ఆటపట్టించడం కోసం కాస్త వింతగా ప్రవర్తిస్తారు. అంటే అబ్బాయి పేరు తీయడం, అమ్మాయిని గిల్లడం, మొత్తానికి అబ్బాయి కనబడగానే ఆటపట్టించడం మొదలుపెడతారు.

* ఇష్టపడిన అబ్బాయి గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటుంది అమ్మాయి. అందుకే ఎప్పుడు లేనట్టుగా, కొత్తగా సాధ్యమైనన్ని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది. అబ్బాయి ఇష్టాలు ఏంటి, సరదాలు ఏంటి, జీవిత లక్ష్యాలు ఏంటి, తనకి ఇంకో అమ్మాయి మీద ఇష్టం ఏమైనా ఉందా ? ఇలాంటివన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.

Continue Reading
To Top